Advertisement
Google Ads BL

శృతిహాసన్ కి అదే వృత్తి కాదు..!


లోకనాయకునిగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కమల్‌హాసన్‌ పెద్ద కూతురు శృతిహాసన్‌ ఎప్పడూ తేడానే. ఆమె తన అలవాట్లతో, వ్యసనాలతో, ప్రొఫెషలిజం లేదనేది అందరికీ తెలుసు. మొదట్లో తమిళం, హిందీ, తెలుగు ఇలా అన్ని చోట్ల ఆమె హీరోయిన్‌గా ఫ్లాప్‌లు ఎదుర్కొని ఐరన్‌లెగ్‌ అని పేరు తెచ్చుకుంది. కానీ 'గబ్బర్‌సింగ్‌'తో బ్లాక్‌బస్టర్‌ సాధించి వరుసగా విజయాలను సాధిస్తూ వెళ్లి టాప్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఆ సమయంలో తనకి ఎప్పటినుంచో రాక్‌గ్రూప్‌లో ఉన్న లండన్‌ యాక్టర్‌ మైఖేల్‌ కోర్స్‌లేతో డేటింగ్‌ చేస్తూ మద్యం, తిండి, స్మోకింగ్‌ పిచ్చిలో ఫిజిక్‌ని పట్టించుకోలేదు. 

Advertisement
CJ Advs

ఇక 'సంఘమిత్ర' ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ సందర్భంగా కేన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో అన్ని తానే హుషారుగా కనిపించింది. కానీ వెంటనే ఆ చిత్రానికి నో చెప్పింది. అదేమిటని అడిగితే ఆ చిత్రం స్క్రిప్ట్‌ ఇంకా పూర్తికాలేదు. అది పూర్తి అయి షూటింగ్‌ చేసే సమయానికి దీనికోసం చాలా రోజులు కేటాయించాల్సి వస్తుంది. నేను సినిమాలలో బిజీ కాబట్టి ఒకే చిత్రం కోసం అంత టైం వృధా చేయనని చెప్పింది. ఇక మరలా పవన్‌ సరసన 'కాటమరాయుడు'లో నటించింది. ఇందులో ఆమె లుక్‌పై తీవ్రమైన విమర్శలు, పవన్‌ అభిమానుల యాంటీని రుచిచూసింది. ఇక తన బోయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌ చేస్తూ ముంబైకి వెళ్లి, ఆమధ్య తన బోయ్‌ఫ్రెండ్‌ని ఎయిర్‌పోర్ట్‌లోనే రిసీవ్‌ చేసుకుని మీడియా ఎదుటే కౌగిలింతలు, కిస్సులు పెట్టింది. పోనీ ముంబైలో ఉండి ఏమైనా బాలీవుడ్‌ చిత్రాలు ఒప్పుకుందా? అంటే అదీ లేదు. ఇక ఈమె ఈమధ్య తరచుగా తన బోయ్‌ఫ్రెండ్‌ కోసం లండన్‌లోనే ఎక్కువ గడుపుతోంది. 

ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో తన నటనా కెరీర్‌ గురించి మాట్లాడుతూ, నటన ఒక్కటే తన గోల్‌ కాదని చెప్పింది. ఈమె ప్రస్తుతం తన డ్యాన్స్‌, సింగింగ్‌గ్రూప్‌తో రాక్‌స్టార్‌గా మారాలని చూస్తోంది. తాజాగా ఆమె లండన్‌లో దిగాను, టాకోస్‌ తిన్నాను. కొత్త కీ-బోర్డు కొన్నాను అని సోషల్‌ మీడియాలో తెలిపింది. ఇక తాజాగా ఆమె 'చెన్నై కాలింగ్‌...చెన్నైకి వస్తున్నాను. ఫ్యామిలీని కలవాలి.. వర్క్‌ ఉంది' అంటూ తెలిపింది. మరి కమల్‌ తీస్తూ మూలనపడ్డ 'శభాష్‌నాయుడు'మరలా మొదలుపెట్టనున్నారా? దాని కోసం వస్తోందా?. అని కొందరు అంటుంటే... తన బోయ్‌ఫ్రెండ్‌తో వివాహం విషయమై ఆమె తన తండ్రితో మాట్లాడాలని తొందరపడుతోందని కొందరు అంటున్నారు. 

Again Shruti Haasan Multi Talent Revealed:

Shruti Haasan tweeted on Chennai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs