Advertisement
Google Ads BL

నయనకి చిరు ఎంతిచ్చినా తక్కువే..!


నయనతార.. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఎంతో క్రేజ్‌ఉన్న ఈ భామ తాజాగా విడుదలైన 'ఆరమ్‌' చిత్రంతో సౌత్‌ ఇండియన్‌ లేడీ సూపర్‌స్టార్‌ అని, సౌత్‌ ఇండియన్‌ అమితాబ్‌ అనే బిరుదులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరోపక్క ఆమె ఎంత రెమ్యూనరేషన్‌ అడిగినా ఇస్తామని, ఆమె మాత్రం తమ చిత్రాలలో నటించాలని స్టార్‌ హీరోల దర్శకనిర్మాతల నుంచి యంగ్‌ హీరోల,కొత్త హీరోలు కూడా పోటీ పడుతున్నారు. 

Advertisement
CJ Advs

ఎందుకంటే తమిళనాడులో పోస్టర్‌పై ఉన్న ఆమె బొమ్మే స్టార్‌హీరోలకు సమానంగా ఓపెనింగ్స్‌ని తెచ్చిపెడుతుంది. యావరేజ్‌ కంటెంట్‌ ఉన్న చిత్రాలను కూడా కేవలం తన ఒంటిచేత్తో బ్లాక్‌బస్టర్స్‌గా నిలుపుతుంది. ఇక ఈమెకి తెలుగులో కూడా బాగా క్రేజ్‌ ఉంది. ఇక విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం తెలుగులో ఇద్దరు సీనియర్‌స్టార్స్‌తో కలసి నటిస్తోంది. బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్‌ నిర్మాణంలో తమిళ సీనియర్‌ నిర్మాత కె.యస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'జై సింహా'లో ఆమె ఫ్యాక్షన్‌ తరహా పవర్‌ఫుల్‌ పాత్రను చేయనుందని సమాచారం. ఇది రజనీకాంత్‌-కె.యస్‌.రవికుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'నరసింహ'లోని రమ్యకృష్ణ క్యారెక్టర్‌ అయిన నీలాంబరి పాత్ర కంటే పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. 

అయితే ఇది కమర్షియల్‌ చిత్రం కావడంతో ఎక్కువ డేట్స్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ త్వరలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా రూపొందుతున్న 'సై..రా..నరసింహారెడ్డి'లో ఆమె పోరాట యోధురాలిగా, ఉయ్యాలవాడ ఇద్దరు భార్యల్లో ఒకరుగా నటిస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి మాత్రం నయనతార ఎక్కువ డేట్స్‌ అవసరం అవుతాయి. మరోపక్క ఇంతవరకు కేవలం తెలుగులోనే చిత్రాలు చేస్తూ వస్తోన్న బాలయ్య తన 100వ చిత్రం 'గౌతమి పుత్రశాత కర్ణి'ని తమిళంలో డబ్‌ చేసి రిలీజ్‌ చేశాడు. ఇక 'జై సింహా'కి తమిళ సీనియర్‌ డైరెక్టర్‌, తమిళంలో ఎంతో క్రేజ్‌ ఉన్న కె.యస్‌.రవికుమార్‌ దర్శకుడు కావడంతో ఇది కూడా తమిళంలోకి డబ్‌ చేయడం ఖాయం. మరోవైపు చిరంజీవి తన 'సై..రా'ని ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీలను టార్గెట్‌ చేస్తున్నాడు. 

అందుకోసం అమితాబ్‌, ప్రియాంకాచోప్రా లేదా ఐశ్వర్యారాయ్‌ వంటి వారిని పెట్టుకొంటున్నాడు. బాలీవుడ్‌లో వారి క్రేజ్‌ చిరు చిత్రానికి ప్లస్‌ అవుతుంది. ఇక తెలుగులో క్రేజ్‌కి ఒక్క చిరునే చాలు. కానీ తమిళం విషయంలో మాత్రం ఆచితూచి అడుగువేస్తున్నారు. విజయ్‌సేతుపతి, నయనతారల క్రేజ్‌ తమ చిత్రానికి కలిసి రావాలని ఆలోచిస్తున్నారు. దీంతో నయనతార బాలయ్య చిత్రానికి 3.5 కోట్లు, చిరు చిత్రానికి 4కోట్లు తీసుకుంటోందట. తమిళంలో మామూలుగా ఆమె తీసుకునేది మూడు కోట్లే. అయితే ఈ ఇద్దరు సీనియర్‌ స్టార్స్‌కి తానే దిక్కు కావడంతో కాస్త రెమ్యూనరేషన్‌ పెంచింది. అయితే ఆమెకున్న క్రేజ్‌, ఆఫర్స్‌ బిజీని దృష్టిలో పెట్టుకుంటే ఆమెకి ఎంతిచ్చినా తక్కువేనని చెప్పాలి...! 

Nayantara 4 Crores Remuneration For Sye Raa Narasimha Reddy Movie:

Chiranjeevi 151 Movie Sye Raa Narasimha Reddy in this Movie Nayantara 4 Crores Remuneration and Nandamuri Balakrishna Jai Simha movie 3.5 Crores.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs