Advertisement
Google Ads BL

ఈ కమెడియన్‌ బయట పెట్టిన నిజాలు..!


సినిమాఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు అందరినీ సంతృప్తిపరచడం వీలుకాదు. ఇక ఈ ఇండస్ట్రీలో ఉండే ఇగోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక పెద్ద హీరోల విషయం అయితే మరీను. హీరోగారు వచ్చారంటే చాలు సినిమా డైరెక్టర్‌ నుంచి డబ్బులు పెట్టి తీసే నిర్మాత వరకు లేచి నిలబడాల్సిందే. ప్రతి ఒక్కరు ఆయన ముందు చేతులు కట్టుకుని వినయవిదేయతలు ప్రదర్శించాలి. ఇక 'బాబు' అని పిలవాల్సిందే.దాంతో ఈ 'బాబు' మీద, ఇండస్ట్రీ మీద ఎన్నోజోక్స్‌ పేలుతుంటాయి. 

Advertisement
CJ Advs

కృష్ణవంశీ తీసిన 'ఖడ్గం'లో కూడా ఆయన చూపించింది తక్కువే. 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ అనే వారికి నేడు కొత్తగా వస్తున్న వారిలో ఉన్న టాలెంట్‌ కూడా లేదు.కానీ భూర్జువా భావజాలం, అహంకారంగా ఎవరి అండలేని వారు ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. తాతలు, నాన్నల పేరు చెప్పుకుని వచ్చేవారు వెలిగిపోతున్నారు. ఇక విషయానికి వస్తే తాజాగా కమెడియన్‌ వేణు మాధవ్‌ మాట్లాడుతూ నాకు కాలు మీద కాలేసుకుని కూర్చోవడం అలవాటు. కానీ అది పెద్ద హీరోలకు నచ్చేది కాదు. ఓ చిత్రం షూటింగ్‌లో నేను ఉండగా అందులో నటిస్తున్న ఓ పెద్ద హీరో పిలిచాడు. 

నేను వెళ్లాను.ఆయన 'ఏం...నువ్వు కాలు మీద కాలేసుకుని కూర్చుంటావంట' అని అడిగాడు. ఎవరు చెప్పారు సార్‌ అంటే ఇప్పుడే నిరూపిస్తాను అని ఫోన్‌ తీసుకున్నాడు. నేను ఇదంతా ఎందుకు సార్‌.. విషయం ఏమిటో స్పష్టంగా చెప్పండి అన్నాను. 'నువ్వు హీరోల ముందుకూడా కాలు మీద కాలేసుకుని కూర్చుంటావట' అన్నాడు. 'నేను ఎవరి కాలు మీద కాలేయను సార్‌...నా కాలు మీద కాలేసుకుంటాను. అందులో తప్పేంటి? అని ప్రశ్నించాను. దాంతో ఆయన ఆగ్రహించారు అని చెప్పాడు. 

ఇక వేణు మాధవ్‌లో కామెడీ టైమింగ్‌ బాగుంటుంది కానీ టైమ్‌ సెన్స్‌ లేదని, పెద్ద హీరోలని కూడా వెయిట్‌ చేయిస్తాడని అంటారు. నిజమేనా? అని ప్రశ్నిస్తే 'నేను ఒక షూటింగ్‌ నుంచి వేరే షూటింగ్‌కి వెళ్లడానికి కాస్త సమయం పడుతుంది. ఆ సమయాన్ని కూడా వెయిట్‌ చేయిస్తున్నానని అంటే ఎలా..? ఆ విషయం కూడా నేను ముందే చెబుతాను. ఫలానా షూటింగ్‌ నుంచి మీ షూటింగ్‌కి రావాలి.. అని చెప్పినా కూడా అందరూ నేను హీరోలను వెయిట్‌ చేయిస్తానని భావిస్తారు.. అందులో నిజంలేదని చెప్పాడు.

Comedian Venu Madhav Tells About Film Industry!:

Comedian Venu Madhav recently told about film industry Facts.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs