మనదేశంలో ఎప్పటినుంచో ఉన్న నినాదం...'జై జవాన్.. జై కిసాన్'. కానీ ఇది నినాదాలకు, ఓట్లు రాబట్టడానికి పనికి వస్తుందేమో గానీ ఇన్నేళ్ళైనా జవాన్, కిసాన్‌ల పరిస్థితులు బాగుపడలేదు. ఉగ్రమూకల నుంచి విదేశీ శక్తులు, టెర్రరిస్ట్‌లు, చొరబాటు దారులు, మన దేశాన్ని నాశనం చేయాలని భావించే ఉగ్రవాదులను తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిలువరించేది ఒక్క జవాన్ మాత్రమే. ఫలితం, లాభం తక్కువే అయినా, తనకు వ్యవసాయం వల్ల కడుపుపూర్తిగా నిండకపోయినా అదే పని చేస్తూ పది మందికి తిండిపెట్టే వాడు కిసాన్.
ఇక జవాన్‌ల విషయానికి వస్తే మన దేశాన్ని పరిపాలించే నాయకుల అవినీతి, కుట్రల వల్ల బలవుతున్న జవాన్లు ఎందరో. బోఫోర్స్ కుంభకోణం, సైనికుల శవ పేటికల కుంభకోణం, పురుగుల అన్నం, ఎదురు తిరిగితే జైలు, నిర్బంధం, హిమాలయాలలో గడ్డకట్టే చలిలో సియాచిన్, కార్గిల్‌వంటి దేశ సరిహద్దుల వద్ద ఇటు పాకిస్థాన్, అటు చైనా మూకలను ఎదురొడ్డి నిలిచి ప్రాణాలు కోల్పోయే జవాన్లు ఎందరో.ఇకే పాకిస్థాన్‌లోని పఠాన్‌కోఠ్‌లో పాక్ ఉగ్రమూకలపై ప్రాణాలకు తెగించి పోరాడి, తీవ్రంగా గాయపడిన ఎన్‌ఎస్‌జి జవాన్ కనగల శ్రీరాములు.
శ్రీకాకుళంకి చెందిన ఈ జవాన్‌తో తాజాగా పరుచూరి గోపాలకృష్ణ సెల్ఫీదిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతోపాటు ఆయన 'మనిషి తనగురించే ఆలోచిస్తాడు. కానీ జవాన్ దేశంగురించి ఆలోచిస్తాడు.. ప్రపంచంలోని అందరు తమ కోసం, తమకుటుంబాల కోసం ఆలోచించి కష్టపడుతారు.కానీ జవాన్ మాత్రం దేశంలోని ప్రజలందరూ, అన్ని కుటుంబాల వాళ్లు నావాళ్లే అని ఆలోచించి దేశరక్షణలో పగలనక, రేయనక కష్టపడుతాడంటూన్నాడు. ఇది యదార్ధం.అయినా డిసెంబర్ 1న విడుదల కానున్న మెగామేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 'జవాన్' చిత్రం ప్రమోషన్‌కి ఈ సంఘటన మంచిగా ఉపయోగపడుతుందేమో చూడాలి....!