Advertisement
Google Ads BL

ఒకే కామెంట్‌తో ముగ్గురిపై సెటైర్లు వేశాడు!


వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా రాంగోపాల్‌వర్మని చెప్పాలి. ఆయన ఏమి మాట్లాడినా దానిలోవ్యంగ్యం,సెటైర్లు ఉంటాయి. ఇటీవలే హైదరాబాద్‌కి అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సుకు రానున్న అమెరికా అధ్యక్షుడిగారాల పట్టి, ఆయన సలహాదారు కూడా అయిన ఇవాంకా ట్రంప్‌ని ఏకంగా సన్నిలియోన్‌తో వర్మ పోల్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 28 నుంచి 30 వరకు జరగనున్న ఈ సమిట్‌కి వస్తున్న ఇవాంకా ట్రంప్‌పై మరోసారి వ్యంగ్యాస్త్రాలు విసిరాడు వర్మ. ఈయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఈ కామెంట్స్‌లో ఆయన 'ఇవాంకా ట్రంప్‌కి ఆమె తాను అందంగా ఉంటానని గర్వం ఎక్కువ. కానీ ఆమె హైదరాబాద్‌ వస్తే కేసీఆర్‌ అందం చూసి కుళ్లు కుంటుంది. ఇవాంకా, కేసీఆర్‌ పక్కపక్కనే కూర్చుంటారు కాబట్టి అందరు కేసీఆర్‌ అందాన్ని పట్టించుకుంటారే గానీ ఇవాంకా అందాలను ఎవ్వరు చూడరు అని పందెం కాస్తున్నాను. ఇక ఇవాంకాకు అంతర్జాతీయ ఉత్తమ అందగత్తెగా, మొత్తం కుటుంబం చూడదగ్గ ఉత్తమ అందగత్తెగా, ఉత్తమ ప్రపంచ సుందరి నాయకురాలుగా మూడు స్పెషల్‌ జ్యూరీ నంది అవార్డులివ్వాలని అన్నాడు'. ఈ కామెంట్స్‌ చూసి చాలా మంది ఇవాంకాపై సెటైర్లు వేశాడని భావిస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఇవాంకా ట్రంప్‌తో పాటు కేసీఆర్‌ అందం అంటూ ఆయనపై, ఉత్తమ జ్యూరీ నంది అవార్డులివ్వాలని నిన్నటి వివాదాస్పదమైన నంది అవార్డు జ్యూరీ మెంబర్స్‌..ఇలా ఏకంగా ముగ్గురిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. 

Advertisement
CJ Advs

కాగా ప్రస్తుతం వర్మ నాగార్జునతో చేస్తున్న షూటింగ్‌లో యాక్షన్‌ సీన్స్‌ని తీస్తూ అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాడు. ఇతర విషయాలను పట్టించుకోకుండా కేవలం తన సినిమా, స్క్రిప్ట్‌, షూటింగ్‌ల మీదే ఏకాగ్రత పెట్టాలని నాగ్‌ హెచ్చరించినా వర్మ మాత్రం షూటింగ్‌ చేస్తూనే తన వ్యంగ్యాస్త్రాలతోతాను బిజీగా ఉన్నాడు. ఇక నాగ్‌-వర్మ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వచ్చాయి. నిన్నటివరకు టబు పేరు వినిపించింది. కానీ దానిని యూనిట్‌ ఖండించింది. ఇక అనుష్కను 'సూపర్‌'ద్వారా హీరోయిన్‌ని చేసింది నాగే. ఆయనతోఆమెకి మంచి రిలేషన్‌ ఉంది. ఆయన నటించిన కొన్ని చిత్రాలలో ఆమె నాగ్‌ కోసం కొన్ని ప్రత్యేక పాత్రలను చేసింది. ప్రస్తుతం ఆమె 'భాగమతి' పూర్తి చేసి ఏ సినిమా ఒప్పుకోకుండా ఖాళీగా ఉండటంతో ఇందులో అనుష్క నాగ్‌ సరసన నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

Varma Satires On Ivanka Trump And KCR:

Ivanka Trump Will Get Shocked After Seen The Beauty Of Our CM KCR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs