Advertisement
Google Ads BL

పవన్ కోసం మాస్ మసాలా ఐటెం సాంగ్?


ఈమధ్యన సినిమాల్లో ఐటెం సాంగ్ కోసం మాస్ ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారు అంటే.. సినిమాలో ఐటెం సాంగ్ పడగానే.. విజిల్స్, పేపర్స్ చింపడం, అల్లరి హడావిడి అంతా ఇంతా కాదు. అందుకే దర్శకులు కూడా తాము తీసే సినిమాలో ప్రత్యేకించి ఒక ఐటెం సాంగ్ ని పెడుతున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఆ ఐటెం సాంగ్  కోసం చాలానే కష్టపడుతున్నారు. ఒక్కో సినిమాలో అసలు పాటలకన్నా ఈ ఐటెం పాటలే పెద్ద హిట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఐటెం సాంగ్ గురించిన ఇంత చర్చ ఎందుకంటే... పవన్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ ఉండబోతోంది. 

Advertisement
CJ Advs

అయితే ఆ ఐటెం సాంగ్ లో ఆ మద్యన హీరోయిన్ పూజ హెగ్డే డాన్స్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. కానీ అది నిజామా కదా అనేది క్లారిటీ లేదు గాని... ఈ పాట... ఐటెం సాంగ్ లా కాకుండా.. సినిమాలో సిట్యుయేషన్ ప్రకారం వచ్చే స్పెషల్ సాంగ్ లా ఉంటుందట. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ ఐటెం సాంగ్ కి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడంటున్నారు. మరి అనిరుద్ ఇప్పటికే కోలీవుడ్ హీరో ధనుష్ కి ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చాలానే ఇచ్చి సక్సెస్ అయ్యాడు. మరి మొదటిసారి పవన్ సినిమాతో తెలుగులోకి అడుగెడుతున్న అనిరుద్ పవన్ కోసం కూడా అదిరిపోయే ఐటెం ని కంపోజ్ చేసాడంటున్నారు.

ఇకపోతే పవన్ సినిమా టైటిల్ ను ఈ నెల 27  న విడుదల చెయ్యబోతున్నట్టుగా ఈ సినిమా నిర్మాతలు హారిక హాసిని క్రియేషన్స్ వారు.. పవన్ PSPK25 ప్రి లుక్ పోస్టర్ తో ప్రకటన చేశారు. ఇక ఆ పోస్టర్ తో పవన్ ఫాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. ఇప్పటికే పవన్ - త్రివిక్రమ్ సినిమాకి అజ్ఞాతవాసి  టైటిల్ ప్రచారం లో ఉంది. ఇప్పుడు అదే టైటిల్ ని ఈ సినిమాకి సెట్ చేస్తారా? లేకుంటే.. మారేదన్నానా అనే  సస్పెన్స్ లో ఉన్నప్పటికీ తమ హీరో సినిమాకి అజ్ఞాతవాసి టైటిల్ సూపర్ అంటున్నారు మెగా ఫాన్స్. చూద్దాం మరో మూడు రోజుల్లో అదేమిటనేది తెలిసిపోయింది.

Item Song In PSPK25:

Items Song in Pawan kalyan Trivikram Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs