Advertisement
Google Ads BL

అంగరంగ వైభవంగా నమిత - వీరేన్ ల పెళ్లి!


తెలుగు, తమిళంలో హీరోయిన్ గా చేసిన నమిత ఇప్పుడు కోరుకున్న వాడితో పెళ్లి పీటలెక్కింది.. సొంతం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నమిత కి ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు. అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న నమిత తమిళ బిగ్ బాస్ ద్వారా హైలెట్ అయ్యింది. అంతలోనే తన స్నేహితుడు అయిన వీరేన్ చౌదరి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నమిత - వీరేన్ చౌదరి వివాహం తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ లో ఈ రోజు శుక్రవారం ఉదయం 5 గంటలకు అంగరంగ వైభవం గా జరిగింది. కొంతమంది కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యన ఈ వివాహం జరిగింది. 

Advertisement
CJ Advs

నమిత - వీరేన్ చౌదరి వివాహానికి కోలీవుడ్ నుండి రాధికా శరత్ కుమార్, శరత్ కుమార్ లు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గత రెండు రోజులనుండి నమిత కు సంబందించిన మెహిందీ వేడుక, సంగీత్ వేడుకలు తిరుపతి లో ఆకాశాన్నంటాయి. సంగీత్, మెహిందీ కి సంబందించిన ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు నమిత - వీరేన్ చౌదరి ల పెళ్లి ఫొటోస్ కూడా ఇంటర్నెట్ సాక్షిగా చక్కర్లు కొడుతున్నాయి.

ఇకపోతే వీరి పెళ్లి తర్వాత వీరేన్ చౌదరి మాట్లాడుతూ పెళ్లి తర్వాత నమిత సినిమాలకు దూరంకాదని... మంచి పాత్రలు వస్తే నటించేందుకు ఆమె సిద్ధమేనని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. అలాగే  సినిమా నిర్మాణంలో అడుగుపెడుతున్నట్లు చెప్పిన వీరేంద్ర... న్యూటాలెంట్‌ను ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే దీనంతటికీ అభిమానుల ఆశీర్వాదం కావాలని, వారు ఆదరిస్తారని ఆశిస్తున్నామని తెలిపాడు.

 

Namita Marriage Photos

Namitha weds Veerandra Chowdhary:

Namitha Weds Veerandra Chowdhary in Tirupati
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs