తమిళనాట ఎమ్జీఆర్, జెమిని గణేషన్, కమల్‌హాసన్, శింబుల తర్వాత ఉమనైజర్‌గా, ప్లేబోయ్‌గా ఆర్యకి పేరుంది. ఆయన అందరు హీరోయిన్లను ముగ్గులోకి దింపుతాడని, అనుష్క, నయనతార, హన్సిక, త్రిష వంటి వారితో ఆయనకు ఎఫైర్స్ ఉన్న మాట నిజమేనని కోలీవుడ్ వర్గాలు బల్లగుద్ది చెబుతుంటాయి. ఈ ప్లేబోయ్ తాజాగా తనకు జీవిత భాగస్వామి కావాలని ఓ వీడియోను పోస్ట్ చేసి మహిళలు తనను అప్రోచ్ అయ్యేందుకు ఓ వెబ్‌సైట్ పేరును, ఫోన్ నెంబర్‌ని ఇచ్చాడు. ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇందులో ఆర్య మాట్లాడుతూ, ఇది సరదాకిగానీ, ప్రాక్టికల్‌జోక్‌గా గానీ అనడం లేదు. ఇది సీరియస్ లైఫ్ మేటర్... అని తెలిపాడు.
ఇక ఇది తమిళ టీవీ షో 'మా పిళ్లై ఆర్య' అనే రియాల్టీ షో కోసం ఆయన ప్రచారంలో భాగంగా చేస్తున్న గిమ్మిక్కని కొందరు అంటున్నారు. అయితే ఈ వీడియో చూసిన వారు మాత్రం నెటిజన్ల నుంచి తోటి తారల వరకు ఆయనపై జోక్స్, సెటైర్స్ వేస్తున్నారు. రానా 'ఆల్ ది బెస్ట్' అని, రాధిక 'ఇదేదో గిమ్మిక్కులా ఉందని', ఖుష్బూ 'ఈ పని నువ్వే చేయగలవని' కామెంట్స్ చేశారు. ఇక ఇలా స్పందించిన వారిలో జయం రవి, త్రిష, శ్రియారెడ్డి, ప్రసన్న, సిద్దార్ద్, సంగీత దర్శకుడు తమన్‌లు ఉన్నారు. ఈ విషయంపై తెలుగులో ప్లేబోయ్ ఇమేజ్ ఉన్న అల్లుశిరీష్ కామెంట్ చేస్తూ...నా ఫ్రెండ్ ఆర్య లైఫ్ పార్ట్‌నర్ కోసం వెతుకుతున్నాడు. ఇంట్రస్ట్ ఉన్న ఆడవారు దయచేసి అప్లై చేయండి.. ఆల్ ది బెస్ట్ చెబుతూనే ఆర్యకి 'నీకు తగిన అమ్మాయి దొరికితే మాత్రం నాకు చెప్పడం మర్చిపోవద్దు' అని మెసేజ్ పెట్టాడు.
బహుశా ఆయనకు వచ్చిన అప్లికేషన్స్‌లో అల్లు శిరీష్ కూడా ఎవరినైనా వెతుక్కుంటాడేమో అని సెటైర్లు పేలుతుండగా, నెటిజన్లు మాత్రం తమకు తోచిన ఫొటోలను, గే ల ఫొటోలను, హిజ్రాల పిక్స్‌ని ఆయనకు పంపుతూ ఆటపట్టిస్తున్నారు. ఇక ఆయన చెప్పిన వెబ్‌సైట్, ఫోన్ నెంబర్లు రియాల్టీషోవి అని నిరూపించే ప్రయత్నం కొందరు చేస్తుంటే మరికొందరు మాత్రం ఇప్పటికే అందరినీ వాడుకున్నాడు. ఇప్పుడు ఫ్రెష్ వాళ్లు కావాలేమో.. అందుకే ట్రై చేసి, అమ్మాయిలను ముగ్గులోకి దింపడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఘాటు విమర్శలే చేస్తున్నారు.