తెలుగు లో హీరోయిన్ గా నిలదొక్కుకోలేక తమిళ్ కి వెళ్ళి సెటిల్ అయ్యింది రాయ్‌లక్ష్మి . అయితే అక్కడ తమిళ్ లో కూడా ఈ అమ్మడుకి చేదు అనుభవం ఎదురైంది. ఇక హీరోయిన్ గా తనకి అవకాశాలు రావని గట్టిగా ఫిక్స్ అయిన రాయ్‌లక్ష్మి సౌత్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ హాట్ ఐటెం గర్ల్ గా మంచి పేరు తెచ్చుకుంది రాయ్‌లక్ష్మి. అలాగే మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' లో కూడా చిరుతో కలిసి రత్తాలు రత్తాలు అంటూ రెచ్చిపోయి స్టెప్పులు వెయ్యడమే కాదు...అందాల ఆరబోతలో కూడా అదరగొట్టింది.
అయితే రాయ్‌లక్ష్మి ఈ సారి తన లక్ ని బాలీవుడ్ లో పరీక్షించుకుందాం అని చెప్పి అక్కడ 'జూలీ 2 ' అనే సినిమాలో బోల్డ్ గా నటించింది. ఈ సినిమా మొత్తం పూర్తి స్థాయి లేడీ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కింది. ఈ మూవీ లోరాయ్‌లక్ష్మి మునుపెన్నడూ లేని విధంగా చాలా హాట్ గా కనిపిస్తుంది. రాయ్‌లక్ష్మి అందాల ప్రదర్శన చేసిన ఈ సినిమా నవంబర్ 24 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అయితే ఖైదీలో ఐటం లో తనతో కలిసి ఇరగదీసిన రాయ్‌లక్ష్మి కి 'జూలీ 2' తో బాలీవుడ్ హిట్ అందుకోవాలని మెగా స్టార్ చిరంజీవి విష్ చేశాడు.
ఒక వీడియో రూపంలో చిరు తన విషెస్ ని తెలియజెయ్యడమే కాదు.. లవ్ యు జూలీ అనేశాడు కూడా. చిరు రాయ్‌లక్ష్మి ని ఉద్దేశించి..... బాలీవుడ్‌లో నీ మొదటి సినిమా విడుదలకానున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ 'జూలీ 2' నీకు చాలా ప్రత్యేకమైన సినిమా అని తెలుసు. నీ సినిమా కెరియర్‌లో ఇది 50వ చిత్రం. అలాగే... నువ్వు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. జూలీ 2 విడుదల సందర్భంగా మరొక్కసారి నీకు శుభాకాంక్షలు... అంటూనే లవ్ యు జూలీ అన్నాడు.
మరి స్వయానా మెగాస్టార్ ఇలా విష్ చేయడం తో ఇప్పుడు రాయ్‌లక్ష్మి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఓ మై గాడ్... చిరు సర్ నిజంగా మీ దీవెనలు నా హృదయాన్ని హత్తుకున్నాయి. ఇది నా జీవితంలోనే గొప్ప బహుమతిగా భావిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదములు చిరంజీవి గారూ.. ఆంటూనే మీరిచ్చిన ఈ ఉత్సాహంతో మీ రత్తాలు సర్‌ప్రైజ్ అయింది. లవ్ యు..సార్.. అంటూ రాయ్‌లక్ష్మి రి ట్వీట్ చేసింది.