Advertisement
Google Ads BL

ఉపాసన ట్వీట్ కి సూపర్ రెస్పాన్స్..!


తన వ్యక్తిగతమైన పనులు ఎన్ని ఉన్నా... నిత్యం తన భర్తకి సంబంధించిన విషయాలు, కుటుంబ విశేషాలు.. ఇలా అన్నింటినీ తమ అభిమానులకు అందిస్తూ మెగాకోడలు ఉపాసన సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె తన మామయ్య చిరంజీవి, భర్త రామ్‌చరణ్‌లు కలిసి ఏకాంతంగా దీర్ఘంగా మంతనాలు జరుపుతున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. మనం మన తల్లిదండ్రులతో సమయం గడపాలని, అది పెద్ద వారికి మనం ఇచ్చే విలువైన బహుమతి, అనందం అంటూ ట్వీట్‌ చేసింది. 

Advertisement
CJ Advs

ఇక ఈ ఫోటో విషయానికి వస్తే ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌ ఇద్దరు గుబురు గడ్డాలు పెంచుకుని, ఒకే డ్రస్‌లో కనిపిస్తుండటం విశేషం. వాస్తవానికి రామ్‌చరణ్‌ చాలా కాలంగా తాను సుకుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న 'రంగస్థలం 1985' కోసం గుబురు గెడ్డం పెంచుతున్నాడు. అది త్వరలో తీయబోతున్నాడు. అంటే ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. అదే సమయంలో గత కొంతకాలంగా తన తదుపరి ప్రతిష్టాత్మక చిత్రమైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ 'సై..రా.. నరసింహారెడ్డి' కోసం చిరంజీవి కూడా గడ్డం పెంచుతున్నాడు. ఈయన గడ్డం మాత్రం వచ్చే ఏడాది మొత్తం కూడా ఉండే అవకాశం ఉంది. సో.. ఇద్దరు గుబ్బురు గడ్డంతో కనిపిస్తున్నారు. 

మరోపక్క రామ్‌చరణ్‌ తాజాగా సురేందర్‌రెడ్డి కుమారుడిని గుర్రంపై ఎక్కించుకుని రైడ్‌ చేసిన విషయం తెలిసిందే. 'సై..రా' దర్శకుడి కుమారుడి కోరిక మేరకు రామ్‌చరణ్‌ గుర్రం ఎక్కితే.. ఇప్పుడు 'సై..రా' చిత్రం కోసం ఆ చిత్ర దర్శకుడు రామ్‌చరణ్‌ తండ్రిని 'గుర్రపుస్వారీ'లో బిజీ చేస్తున్నాడు. కాకతాళీయమైన ఇది చాలా ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు రామ్‌చరణ్‌ 'కాఫీ కోసం మా నాన్నకి బయటికి తీసుకెళ్లేందుకు ఒప్పించడం ఎంతో ఆనందంగా ఉందని' ట్వీట్‌ చేశాడు...! 

Upasana Tweeted Chiranjeevi and Ram Charan Pic:

Upasana Tweet Sensation in Social Media 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs