బండ్లగణేష్‌కి అవకాశవాది అని, ఎవరి డేట్స్ కావాలంటే వారిని భజన చేస్తుంటాడనే విమర్శ ఉంది. కానీ ఈ మద్య ఆయన దానికి ఎంతో తెలివిగా సమాధానం చెప్పాడు. దేవుళ్లనే వరాలు ఇవ్వమని భజన చేస్తున్నాం.. మరి మాకు స్టార్స్ దేవుళ్లతో సమానం. కాబట్టి దీనిని భజన అనకూడదు. బాధ్యత అనాలి. మా పొగడ్తల ద్వారా హీరోలకు, వారి ఫ్యాన్స్‌కి పాజిటివ్ ఎనర్జీని ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించాడు. ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో మీరు పరిశ్రమకి దూరమైపోయి వివాదాలు వచ్చాయి కదా! మరి మరలా స్టార్స్ డేట్స్‌ని ఎలా సంపాదిస్తారు? అంటే ఆ విషయం చెప్పను, అది కేవలం నాకే తెలిసిన విధ్య. అందరికీ ఎలా చెబుతాను? అని జవాబిచ్చాడు.
తాజాగా ఆయన మాట్లాడుతూ.. అందరు హీరోలు మా వారే. మా ఇంట్లోని వారు అందరి హీరోలను ఇష్టపడతారు. నాకు పవన్ అంటే ప్రాణం, మా నాన్నకి ఎన్టీఆర్ అంటే, మా అబ్బాయికి అల్లుఅర్జున్ అంటే ఇష్టం. ఇలా మేము అందరికీ అభిమానులమే. అందరు మా ఇంటికి వచ్చిన వాళ్లేనని చెప్పాడు. ఇక మెగాఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీల హీరోలతో సినిమాలు తీశారు కదా..! మరి అక్కినేని ఫ్యామిలీని ఎందుకు వదిలిపెట్టారు? అని అడిగితే అఖిల్ రెండో చిత్రం చేద్దామని ప్రయత్నం చేశాను. వీలు కాలేదు. త్వరలో ఖచ్చితంగా అఖిల్‌తో సినిమా తీస్తాను. ఇక నేను ఇక్కడే మరో 20ఏళ్లు నిర్మాతగా వెలగడం ఖాయం. మా అబ్బాయి కూడా నిర్మాతే అవుతాడు, హైదరాబాద్‌లో చిన్న సినిమాల కోసం ఓ స్టూడియో కడతాను అని ప్రకటించాడు. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమేస్తుంది.
బడా బడా నిర్మాతలే రెండు మూడు ఫ్లాప్‌లు వస్తే ఇండస్ట్రీకి దూరమైపోయి, మరలా తమ మొహమే చూపించడంలేదు. మరి 20ఏళ్లపాటు ఈయన 'బ్లాక్‌బస్టర్' నిర్మాతగానే కొనసాగుతానంటున్నాడు. ఇక ఈయన మెగా, నందమూరి, అక్కినేని ఫ్యామిలీలతో చేస్తానని చెప్పాడే గానీ అతి ముఖ్యమైన ఘట్టమనేని ఫ్యామిలీ గురించి, పాపం... మంచు ఫ్యామిలీ హీరోలతో చేస్తానని చెప్పడం, తమ ఇంట్లో వారికి మహేష్ అన్నా, మంచు విష్ణు అన్నా ఎంతో ఇష్టమని చెప్పలేదు ఏమిటి చెప్మా....!