Advertisement
Google Ads BL

అఖిల్ నెక్స్ట్.. ఈ టాప్ డైరెక్టర్ తోనేనా?


కొరటాల వరుస హిట్స్ తో టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ పీఠాన్ని అధిరోహించాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమా చేస్తున్న కొరటాల ఈ సినిమా తర్వాత  తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఏ ఫంక్షన్ కి వెళ్లిన, ఎక్కడికైనా కొరటాల - ఎన్టీఆర్ కలిసి వెళ్లడం... వారిమధ్యన సాన్నిహిత్యాన్ని చూసిన అందరూ మరోమారు అంటే.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా తర్వాత, మహేష్ - కొరటాల సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ - కొరటాల సినిమా చేస్తారని అందరూ దాదాపు ఫిక్స్ అయ్యారు. కాని ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా లేట్ అవుతుందంటున్నారు. ఎందుకు అనే విషయం సరిగ్గా క్లారిటీ లేదుగాని.... లేటెస్ట్ న్యూస్ ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్ అనే టాక్ వుంది.

Advertisement
CJ Advs

అందుకే ఇప్పట్లో కొరటాల ఇంకా ఎన్టీఆర్ సినిమా వర్కౌట్ అయ్యే అవకాశం లేదని ఫిల్మ్ నగర్ టాక్. మరోపక్క రామ్ చరణ్ కూడా కొరటాల శివకు హ్యాండ్ ఇచ్చాడనే టాక్ నడుస్తుంది. మరి కొరటాల ఖాళీగా ఎందుకు ఉంటాడు. అందుకే కొరటాల శివ.. అఖిల్ తో సినిమా కమిట్ అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో' అనే సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  దాని తర్వాత అఖిల్....కొరటాల శివ దర్శకత్వంలో  సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా ప్రాజెక్ట్ కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయట. 

నిజంగానే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే... అఖిల్ కెరీర్ ఊపందుకున్నట్టే. ఎందుకంటే కొరటాల సినిమాల్లో హీరో పాత్రకు ప్రత్యేకత 100 పర్సెంట్ ఉంటుంది. అంతే కాకుండా కొరటాలకు హీరోలను ఎలా ఎలివేట్ చేయాలో బాగా తెలుసు. దీన్నిబట్టి అఖిల్ కి తన కెరీర్ లో ఒక కమర్షియల్ మూవీ పడే ఛాన్స్ ఉంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది అని అంటున్నారు ఫిలింనగర్ వాసులు.

Akhil Akkineni Next Film in Koratala Direction:

Akhil to do a film under Koratala Siva direction?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs