Advertisement
Google Ads BL

సమంత నెక్లెస్ ని కొట్టేసిందెవరు?


ఈమధ్యన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొందరి స్టార్స్ ఇళ్లలో కొన్ని విచిత్రకర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అప్పుడెప్పుడో.. శ్రీకాంత్ ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించి కారు అద్దాలు పగలగొట్టాడు. తీరా చూస్తే అతను శ్రీకాంత్ ఇంట్లో పనిచేసి మానేసిన పనివాడే. అలాగే రీసెంట్ గా చిరంజీవి ఇంట్లో సర్వర్ చెన్నయ్య చిరు ఫ్యామిలీకి తెలియకుండా బోలెడు డబ్బు నొక్కేసి ఊరి చివర ప్లాట్స్ కొన్నాడు. చివరికి రెండు లక్షలు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అలాగే ఇప్పుడు మరో టాప్ సెలెబ్రిటీ ఇంట కూడా ఒక వస్తువుని దొంగలు కొట్టేసినట్టుగా  తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ఆ సెలెబ్రిటీ ఎవరో కాదు సమంత అక్కినేని. సమంత కి నాగ చైతన్య కి ఈ మధ్యనే పెళ్లి జరిగింది. అక్కినేని ఇంటికి కోడలిగా వచ్చిన సమంతకి ఈ పెళ్ళికి గిఫ్ట్ గా నాగార్జున బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న కళ్యాణ్ జ్యూవెలరీ వాళ్ళు మూడు కోట్ల విలువైన వజ్రాల నెక్లెస్ ఇచ్చారట. అయితే ఇప్పుడు ఆ నెక్లెస్ మిస్ అయ్యిందనే టాక్ ఫిలింనగర్ సర్కిల్స్ లో వినబడుతుంది. అయితే ఆ నెక్లెస్ పోయిన విషయం పోలీసుల వరకు చేరలేదని ఇంట్లోవాళ్లే సీసి కెమెరా ఫ్యూటేజ్ పై మానిటరింగ్ చేసి దొంగని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి.

అయితే పెద్ద వాళ్ళింట్లో వ్యవహారాలు ఇలానే ఉంటాయి. అంత పెద్ద వస్తువు మిస్ అయ్యిందంటే పరువుపోతుందని పోలీసుల వద్దకు వెళ్లకుండా ఇలా ఎవరైనా పనివాళ్ళు తీశారా.. లేకుంటే ఆ నెక్లెస్ ని ఎక్కడన్నా పెట్టి మరచిపోవడం జరిగిందా అనే విషయాన్నీ కూడా పరిశీలిస్తున్నారట. మరి మూడు కోట్ల నెక్లెస్ అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా అక్కినేని ఫ్యామిలీ చాలా జాగ్రత్తలే తీసుకున్నప్పటికీ... అది చిలవలు పలవలుగా బయటికి పొక్కిపోయింది.

ఇకమొన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో అగ్నిప్రమాదం, నిన్న నాగ సుశీల చింతలపూడి శ్రీనివాసరావుపై ఫోర్జరీ కేసు, ఈ రోజు సమంత నెక్లెస్ పోవడం. మరి ఇవన్నీ కాకతాళీయంగా జరిగినా కూడా వీటన్నింటికి ఒకదానితో ఒకటి లింక్ పెట్టేసి హాట్ హాట్ చర్చలు జరిపేస్తున్నారు కొందరు.

Samantha Diamond Necklace Stolen:

Samantha Necklace Theft Shocking Truths Came Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs