Advertisement
Google Ads BL

బాబోయ్ విద్యుల్లేఖ ఏంటీ ఫోజులు?


మన దేశంలో మరీ ముఖ్యంగా అన్ని భాషల చిత్రాలలో వ్యక్తుల లుక్‌ల మీద, వారి సైజులు, అంగవైకల్యాలపై సెటైర్లు వేస్తూ దానినే ఓ కామెడీగా చూపిస్తారు. తెలుగులో కూడా 'కల్పనారాయ్‌, ఐరన్‌లెగ్‌ శాస్త్రి' వంటి వారి ఒబేసిటీ చుట్టు కామెడీ ట్రాక్‌లు నడుపుతూ సెటైర్లు చూపించేవారు. ఇలాంటి మరో లేడీ కమెడియనే విద్యుల్లేఖ రామన్‌. ఈమె తండ్రి కూడా తమిళ సినీనటుడు, టీవీ ఆర్టిస్ట్‌. ఈమె తమిళంలో సంతానం, సుందర్‌ సి వంటి వారితో కలిసి నటించింది. ఈమె సినీ ఎంట్రీ గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా రూపొందిన 'ఏటో వెళ్లిపోయింది మనసు'. ఇందులో ఆమె సమంతకు స్నేహితురాలు జెన్నీగా నటించింది. ఆ తర్వాత 'రాజుగారి గది, రన్‌ రాజా రన్‌, సరైనోడు' నుంచి ఇటీవల విడుదలైన 'రాజా ది గ్రేట్‌' వరకు ప్రేక్షకులను కితకితలు పెట్టి నవ్వించింది. 

Advertisement
CJ Advs

ఇక ఒబేసిటీ అంటే కేవలం ఎక్కువ తినే వారికే వస్తుందనే అపోహ ఉంది. దానికి జీన్స్‌ నుంచి థైరాయిడ్‌ వరకు ఎన్నో కారణాలు ఉంటాయి. ఎవ్వరూ లావుగా ఉండాలని కోరుకోను. నటీనటులు, మరీ ముఖ్యంగా నటీమణులు అసలు కోరుకోరు. ఇక తాజాగా విద్యుల్లేఖ రామన్‌ ఓ క్లీవేజ్‌ ఫొటో షూట్‌ చేసింది. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అంత భారీ శరీరంతో కూడా ఆమె క్లీవేజ్‌ షో చేయడం సాహసమనే చెప్పాలి. తనపై సెటైర్లు పేలుతాయని తెలిసినా ఆమె ఆ పని చేసింది. దీని గురించి ఓ నెటిజన్‌ 'ఏం.. హీరోయిన్‌గా మారాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించాడు. దానికి ఆమె 'ఖచ్చితంగా కాదు.. ఇలా కనిపించడానికి ఓ కారణం ఉంది. 

కమెడియన్లు కూడా అందంగా కనిపించాలనే కోరుకుంటారు గానీ పల్లెటూరి బైతుల్లా వుండాలని భావించరు. 'మీరు చూపించాల్సిన పనిలేదు' అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేసిన నెటిజన్‌కి ఉద్దేశించి ఆమె 'ఓ మహిళ తనను తాను ఆరాధించుకోవడం తప్పా?ఈ విధమైన సంకుచిత  ధోరణులతో కూడిన వాటికి జవాబు ఇవ్వడానికి నేను సంకోచించను. ఇలాంటి ఆలోచనలతో మీరు తిరోగమనంలో పయణించకండి...! నాకు గతంలోకి వెళ్లే అవకాశం ఉంటే నన్ను నేనే ఆరాధించుకోమని చెబుతాను. అలా నేను అనుకున్న దానిని సాధిస్తాను. అంటూ ఎవరు మనల్ని ఆరాధించినా ఆరాధించకపోయినా మనల్నిమనం ఆరాదించుకోవాలి. భారీ సైజులో కూడా అందం ఉంటుంది' అని చెప్పుకొచ్చింది. 

Vidyullekha Raman Posted Hot Photos:

Vidyulleka Raman Bold Photo Sensation in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs