తెలుగులో విలన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా, విలన్‌గా ఉండే లీడ్ రోల్స్‌తో పాటు 'పెదరాయుడు, అసెంబ్లీరౌడీ, రౌడీ గారి పెళ్లాం, అల్లుడు గారు' ఇలా హీరోగా బ్లాక్‌బస్టర్స్‌ని ఇచ్చి కలెక్షన్ కింగ్‌గా మారాడు మోహన్‌బాబు. 500లకు పైగా చిత్రాలలో నటించిన ఈయన తెలుగులో ఉన్న విలక్షణ నటుల్లో ముఖ్యులు. ముఖ్యంగా ఈయన డైలాగ్‌డెలివరీ అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ మధ్య ఆయన ఎక్కువగా చిత్రాలు ఒప్పుకోవడం లేదు. 'పొలిటికల్ రౌడీ'తో పాటు వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం, 'పాండవులు పాండవులు తుమ్మెద' వంటి మంచు ఫ్యామిలీ చిత్రాలలో మాత్రమే కనిపించాడు. కాగా ప్రస్తుతం పొలిటికల్ టచ్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు.
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు మచ్చుకి కూడా కనిపించని రోజుల్లోనే 'అసెంబ్లీ రౌడీ' ద్వారా సంచలనం సృష్టించిన ఆయన ప్రస్తుతం మరోసారి అలాంటి చిత్రంగానే 'గాయత్రి'ని చేస్తున్నాడు. ఇది పూర్తిగా పొలిటికల్ బ్యాగ్రౌండ్, సెటైరిక్, హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న చిత్రంగా రూపొందుతోంది. ఇక ఇలాంటి స్టోరీ దొరికితే మోహన్‌బాబు ఏ స్థాయిలో తన నటనతో రెచ్చిపోతాడో తెలిసిందే. రచయితగా, దర్శకునిగా ఎంతో టాలెంట్ ఉన్న 'ఆ..నలుగురు' రచయిత, 'పెళ్లైన కొత్తల్లో' చిత్ర దర్శకుడు మదన్ ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. మంచిటాలెంట్ ఉన్న ఆయనకు ఇప్పటివరకు పెద్ద బ్రేక్ రాలేదు. అది ఈ చిత్రం ద్వారా వస్తుందని నమ్మకంతో ఉన్నాడు. ఇందులో మంచు విష్ణు కూడా ఓ పాత్రలో నటిస్తున్నాడు. ఇక టైటిల్‌గా 'లక్ష్మీ, భవాని,తులసి'ల లాగా లేడీ పేరుతో 'గాయత్రి' అని పెట్టడం ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. తొలిపాటను తిరుపతిలో ప్రత్యేకంగా తయారు చేసిన వినాయకుని విగ్రహం వద్ద 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 400 మంది డ్యాన్సర్ల మీద చిత్రీకరించారు. ఈ పాటకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య డ్యాన్స్ కంపోంజ్ చేశాడు.
ఇక మోహన్‌బాబు కెెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో మలుపులు ఉన్నాయి. ఆయన కెరీర్‌లో ఎన్నో ఇన్నింగ్స్‌లని ముగించి, మరి ఎన్నో ఇన్నింగ్స్‌లను స్టార్ట్ చేశాడు. కానీ 'గాయత్రి' చిత్రాన్ని మాత్రం ఖచ్చితంగా ఆయనకు ఓ సెకండ్ ఇన్నింగ్స్‌గా కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని అంటున్నారు.