Advertisement
Google Ads BL

రూమర్స్‌ పై కలర్ స్వాతి ఇలా!


నేను సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తాను. నా ఏజ్‌వారికి ఏదైనా సినిమాలలో రోల్స్‌ ఉన్నాయంటే ఖచ్చితంగా ఆడిషన్స్‌కి హాజరవుతాను. కానీ ఎవరినీ అవకాశం ఇవ్వమని బతిమిలాడను. ఇక నేను ఇతర ఫంక్షన్‌, పార్టీలు, వేడుకలకు కూడా రాను. కానీ నేను నాతో నటించే ఆర్టిస్టులతో చనువుగా ఉంటాను. నా కెరీర్‌లో నేను నటించిన ప్రతి హీరోతో నాకు ఎఫైర్లు అంటగట్టారు. మొదటగా కృష్ణవంశీ 'డేంజర్‌' చిత్రంలో నాతో నటించిన అల్లరినరేష్‌కి నాకు ఎఫైర్‌ ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 'అష్టాచెమ్మా' సమయంలో నానితో నాకు సంబంధం ఉందని పుకార్లు పుట్టించారు. 'స్వామి రా..రా' చిత్రం సమయంలో నిఖిల్‌తో ఎఫైర్‌ అంటగట్టారు. ఇక తమిళంలో చేస్తున్న సమయంలో హీరో 'జై'కి నాకు లింకు పెట్టారు. చివరకు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ నాతో ఓ పాట పాడిస్తే కూడా ఎఫైర్‌లేనిదే పాట ఎందుకు పాడిస్తారు అంటూ ఎఫైర్‌ కలిపారు. నిప్పులేనిదే పొగరాదని అంటారు. కానీ నా విషయాలలో నిప్పు లేకుండానే పొగ వచ్చింది.

Advertisement
CJ Advs

ఇక మాకు కూడా ఫ్యామిలీస్‌ఉంటాయి. ఇలాంటి గాసిప్స్‌ సృష్టించినప్పుడు నేను, నా కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడతామో వారికి ఎందుకు అర్ధం కాదో నాకు తెలియడం లేదు. ఇక నాకు చిన్నతనంలో మాటీవీలో చేసిన 'కలర్స్‌' అనేది ఇంటి పేరైంది. కానీ చాలామంది ఈ 'కలర్స్‌' అనే పదాన్ని కూడా టీజింగ్‌కి, సెటైర్లకు వాడుకుంటున్నారు. ఇక నాకెరీర్‌లో నన్ను ముందుగా పెట్టుకుని చివరి క్షణంలో వేరే వారిని పెట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఆయా చిత్రాలలో మొదట నేనే హీరోయిన్‌ని అని బయటికి చెప్పే అలవాటు నాకులేదు. 

ఇక నా సక్సెస్‌ గ్రాఫ్‌ ఎప్పుడు స్లోగానే ఉంటుంది గానీ ప్రతిసినిమా, ప్రతి ఏడాది నేను వరుసగా హిట్స్‌ ఇవ్వలేదు. నాకు అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఓ మంచి సినిమా, ఓ మంచి హిట్‌వచ్చేవి. అలా వచ్చినవే 'ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే, సుబ్రహ్యణ్యపురం, స్వామి..రా..రా' వంటివి. నాకు సక్సెస్‌ అనేది నిదానంగా వచ్చి హలో చెబుతుందని చెప్పింది. ఏమైనా ఇంత మంచినటికి వరుస అవకాశాలు రాకపోవడం మాత్రం బాధని కలిగించే విషయం..! 

Colors Swathi Reacted on Rumors:

Color Swathi Calrity About Rumors on Her
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs