నారా రోహిత్ కెరీర్ లో మొదటిసారి ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా చేశాడు. ఈసారి బాలకృష్ణుడు సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. అంతేకాకుండా కమర్షియల్ హీరో అనిపించుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ సినిమా వచ్చే శుక్రవారమే విడుదలకాబోతుంది. మరి నారా రోహిత్ ఈ సినిమాతో ఎలాగైనా కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే బాలకృష్ణుడు సినిమా కోసం తెరవెనక భారీ లాబీయింగ్ మొదలయిందని టాక్ ఈ లాబీయింగ్ జరగడానికి గలకారణం.. ఈ శుక్రవారం లెక్కకు మించి చిన్న పెద్ద సినిమాలు విడుదలకాబోతున్నాయి.
కేవలం రెండు సినిమాలు విడుదలయితేనే... థియేటర్స్ సమస్య పుష్కలంగా ఉంటుంది. కానీ ఈ వారం ఏకంగా ఆరేడు సినిమాలు విడుదలవుతున్నాయి. అందుకే బాలకృష్ణుడు సినిమాని అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసి, కళ్లుచెదిరే కలెక్షన్లు చూపించాలని ఓ సెక్షన్ గట్టిగా ప్రిపేర్ అవుతోంది అంటున్నారు. మరి నారా రోహిత్ సినిమాతో పాటు హే పిల్లగాడా, మెంటల్ మదిలో, లచ్చి, దేవిశ్రీప్రసాద్, నెపోలియన్ సినిమాలు కూడా వస్తున్నాయి. వీటికి కూడా థియేటర్లు కావాలి. సరిగ్గా ఇక్కడే బాలకృష్ణుడు సినిమా విషయమై లాబీయింగ్ మొదలైంది అని అంటున్నారు.
మరి ఈ వారం విడుదలయ్యే మిగిలిన అన్ని సినిమాలతో పోలిస్తే నారా రోహిత్ సినిమాకే ఎక్కువ థియేటర్లు దక్కేలా తెరవెనక పావులు కదుపుతున్నారట. మరి నిజంగా అదే కనుక జరిగితే చిన్న సినిమాలకు మరోసారి అన్యాయం తప్పకపోవచ్చు అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ఈవారం విడుదలయ్యే చిన్న సినిమాల్తో పాటే నారా రోహిత్ ఫ్రెండ్ శ్రీ విష్ణు సినిమా మెంటల్ మదిలో కూడా విడుదలయ్యి నారా రోహిత్ సినిమాకి గట్టిపోటీ ఇవ్వబోతోంది. ఎందుకంటే ఈ సినిమా వెనుక నిర్మాత సురేష్ బాబు ఉన్నాడు. ఆ లెక్కన బాలకృష్ణుడికి కాస్త పోటీ ఉంటుంది. అటు థియేటర్స్ విషయంలోనూ.. ఇటు సినిమా విషయంలోనూ ఈ పోటీ తప్పదంటున్నారు.