Advertisement
Google Ads BL

అఖిల్ అయితే ఏంటి? వెనక్కి తగ్గేదే లేదు!


అక్కినేని వారసుడిగా నాగ్ చిన్న కొడుకు అఖిల్ ఎంతో గ్రాండ్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కాని అఖిల్, వి వి వినాయక్ దర్శకత్వంలో నటించిన తొలి సినిమా 'అఖిల్' బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం మూటగట్టుకుంది. అయితే ఆ ఫ్లాప్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం తీసుకున్న అఖిల్ తన సెకండ్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో' అనే సినిమా చేస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీ సినిమా 'మనం'ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన విక్రమ్ కుమార్ ఈ సినిమాని యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తీర్చి దిద్దుతున్నాడు. ఈ సినిమా పై అఖిల్ తో పాటు ఈ సినిమా నిర్మాత నాగార్జున కూడా  చాలా ఆశలు పెట్టుకున్నాడు.  

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాని నాగార్జున ఎంతో పకడ్బందీగా డిసెంబర్ 22 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాడు. డిసెంబర్ 22 అయితే క్రిస్టమస్ సెలవలు కలిసొచ్చి బాక్సాఫీసు వద్ద 'హలో' కాస్త గట్టిగా నిలబడే ఛాన్స్ ఉందని నాగ్ తెలివైన ప్లాన్ వేశాడు. కాని అదే టైంకి నాని తన 'మిడిల్ క్లాస్ అబ్బాయి'ని దింపుతున్నాడు. నాని హీరోగా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వస్తున్న ఈ మూవీపై కూడా అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. సో డిసెంబర్‌ 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దిల్‌ రాజు చూస్తున్నాడట. అయితే MCA  సినిమా డేట్ ప్రకటించాక నాగ్.... దిల్ రాజుతో మంతనాలు జరిపి వారి మూవీని ప్రీ పోన్ చేయించినట్లుగా వార్తలొచ్చాయి.

ఆ కథనాల ప్రకారం నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చిత్రం డిసెంబర్ 13 కే వచ్చేస్తుందనే న్యూస్ హల్చల్ చేసింది. 'హలో'తో క్లాష్‌ లేకుండా డిసెంబర్‌ 13 న 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి' వస్తుందని అనుకున్నారు. కానీ హాలిడేస్‌ కంటే అంత ముందుగా రావడం కంటే హాలిడే టైమ్‌లో రావడం మేలని దిల్‌ రాజు కూడా నాగ్ లాగే నిర్ణయించుకున్నాడట. మరి ఇంత టఫ్ కాంపిటీషన్ తో అఖిల్ ఎలాంటి హిట్ కొడతాడో అని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

Nani To Compete With Akhil?:

NO Change in Nani Movie MCA Release Date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs