Advertisement
Google Ads BL

నాగ్ సుడి మాములుగా లేదంతే!


నాగార్జునది ప్యూర్‌గా బిజినెస్‌ మైండ్‌. ఏం చేస్తే భవిష్యత్తులో దాని వల్ల ఎంత ఉపయోగం ఉంటుందా? అనేదే ఆలోచిస్తాడు. నిమ్మగడ్డప్రసాద్‌, చిరంజీవి, అల్లుఅరవింద్‌లతో చేసిన బిజినెస్‌లలో కూడా అంతే. అలాగే తాము హైదరాబాద్‌లో ఉండటంతో కేటీఆర్‌కి, కేసీఆర్‌కి దగ్గరవుతున్నాడు. కానీ ఏపీ సీఎంను లెక్కల్లోంచి ఎప్పుడో తీసేశాడు. అందునా బాలయ్యతో ఉన్న విభేదాల దృష్ట్యా తెలంగాణలో ఉన్న తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని భావించి, తన కోడలు సమంతను తెలంగాణకు చేనేత అంబాసిడర్‌గా వ్యవహరించేలా చేసి తన ఎన్‌కన్వెక్షన్‌, స్టూడియోలకి ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక 'మనం' చిత్రం చేయడంలో కూడా ఆయన సరైన సమయం, స్టోరీ చూసి సెంటిమెంట్‌ మీద దెబ్బకొట్టాడు. దాంతో ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. నాగచైతన్య, అఖిల్‌ల మొదటి చిత్రాలపై అనుమానం ఉండటంతో ఆయన వాటిని దిల్‌రాజు, నితిన్‌ వంటి వారు ఉత్సాహపడుతుంటే సరేనన్నాడు. ఆయన అనుకున్నట్లే అవి ఆడలేదు. ఈ విషయంలో తన జడ్జిమెంట్‌ పవర్‌ చూపించి, నష్టాల నుంచి చాకచక్యంగా తప్పుకున్నాడు. ఏయన్నార్‌ బతికున్నంత కాలం ఆయనకు తల్లిలేని బిడ్డ అయిన సుమంత్‌ అంటే ఎంతో ఇష్టం. ఏయన్నారే ఒక సందర్భంలో నాకు నాగార్జున కంటే సుమంత్‌ ఎక్కువ. వాడిని హీరోగా నిలబెట్టాలని చెప్పి విశ్వప్రయత్నాలు చేశాడు. కానీ ఏయన్నార్‌ మరణించిన తర్వాత సుమంత్‌, సుశాంత్‌ వంటి వారితో చిత్రాలు చేయకుండా నాగ్‌ తప్పించుకుంటున్నాడు. 

ఇక ఆయన తన తండ్రి చివరి చిత్రమైన 'మనం' చిత్రం కోసం వేసిన సెట్‌ని ఎంతో అపురూపంగా చూసుకునే వాడు. కానీ అది అనుకోని చిన్న తప్పిదం వల్ల కాలిపోయింది. దీంతో తనకు రెండు కోట్లు నష్టం వచ్చిందని వాపోయాడు. అయితే ఆయన తండ్రి జ్ఞాపకాలను ఎవ్వరూ తిరిగి ఇవ్వలేరు గానీ ఆయన ఆ 'మనం' సెట్‌కి ముందుగానే ఇన్సూరెన్స్‌ చేశాడట. దాంతో వచ్చిన రెండు కోట్ల నష్టం కంటే ఇప్పుడు ఆయనకు మరో 50లక్షలు అదనంగా అంటే ఇన్సూరెన్స్‌ మీద 2.5కోట్లు వచ్చాయని సమాచారం. మొత్తానికి 'మనం'కి అవార్డుల విషయంలో అన్యాయం జరిగినా, డబ్బు విషయంలో మాత్రం నాగార్జునకి నష్టాలకంటే అన్ని చోట్లా లాభాలే వస్తున్నాయి. ఆయన హస్తవాసి అలాంటిది మరి..! 

Nagarjuna gets 2.5 Cr insurance:

2.5 Crores Insurence to Annapurna Studioes Fire Accidents
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs