Advertisement
Google Ads BL

అజ్ఞాతవాసి పై కొత్త రూమర్లు!


లండన్ లో అవార్డు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హైదరాబాద్ కి చేరుకున్నాడు. పవన్ లండన్ నుండి రాగానే త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నా... ఇంకో 20 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందనే టాక్ ఉంది.  ఇక షూటింగ్ కంప్లీట్ కాగానే...  త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్ పనులు కూడా చూసుకుంటాడు. ఇదిలా ఉంటే డిసెంబర్ రెండో వారంలో ఈ సినిమా ఆడియో లాంచ్ ని గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.

Advertisement
CJ Advs

ఇకపోతే ఇప్పటివరకు టైటిల్ లో క్లారిటీ లేని మేకర్స్ ఈ నెల చివరన టైటిల్ ప్రకటిస్తారని టాక్ వుంది. ప్రస్తుతం పవన్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ అజ్ఞాతవాసి ప్రచారంలో ఉంది. అయితే ఈ అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ ని అమరావతి వేదికగా జరపాలని మూవీ యూనిట్ భావిస్తున్నారని టాక్. స్వతహాగా చంద్రబాబుకి క్లోజ్ అయిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోరిక మేరకే ఈ ఆడియో వేడుకని అమరావతిలో జరపాలని నిర్ణయించుకున్నట్టుగా  తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఈ మధ్యన తెలుగుదేశం పార్టీపై కత్తులు దూస్తున్నాడు. మరి అజ్ఞాతవాసి ఆడియో కోసం పవన్ నిజంగానే అమరావతికి వెళతాడా? అనే విషయంపై కూడా చర్చ మొదలైంది. ఇకపోతే అజ్ఞాతవాసి ఆడియో అమరావతిలో అనే విషయం పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్ ఇంకా అను ఎమాన్యుఎల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తెలుగులో మొదటిసారి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న అనిరుద్ మ్యూజిక్ పై కూడా అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Agnathavasi Audio Venue Rumours!:

Agnathavasi Audio Venue at Amaravati?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs