Advertisement
Google Ads BL

అవునా.. జూలీ.. ఇది నీ కథేనా!


దక్షిణాదిలో హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న లక్ష్మి రాయ్ ఇప్పుడు జూలీ 2 తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ సినిమాతో లక్ష్మి రాయ్ బాలీవుడ్ లో తన లక్ ని పరిక్షించుకోవాలి అనుకుంటుంది. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్ ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి ఎన్నడూ లేనివిధంగా హాట్ హాట్ డ్రెస్‌లతో పిచ్చేకిస్తుంది లక్ష్మి రాయ్. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదలకావాల్సిఉండగా.. సెన్సార్ కారణాలతో ఈ సినిమా ఈ నెల 24  శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ లక్ష్మి రాయ్ హాట్ హాట్ పోస్టర్స్ తో సినిమాకి ఎక్కడలేని పబ్లిసిటీ చేస్తుంది.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా గా తెరకెక్కిన విషయం తెలిసిందే.  ఈ సినిమా ఒక హీరోయిన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందని టాక్.  అప్పట్లో ఖాన్ త్రయంలో స్టార్ లుగా ఉన్న టైం లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తెలుగులో ఒక వెలుగు వెలిగిన నగ్మా జీవిత చరిత్ర ఆధారంగా ఈ జూలీ 2  తెరకెక్కిందనే టాక్ వినబడుతుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైం లో భోజ్ పురి మూవీస్ ఓకే చేసి ఇటు టాలీవుడ్ కి దూరం అయిపోయింది నగ్మా. మళ్ళీ ఆ తరువాత తమిళ హీరో అయిన శరత్ బాబు తో ఒక ఎఫైర్ నడిపించి దక్షిణాదిన మళ్ళీ సంచలనం సృష్టించింది నగ్మా. 

అయితే ఈ జూలీ 2  లో కూడా లక్ష్మి రాయ్ పాత్ర మొదట పెద్ద సినిమాలు చేసి తరువాత భోజ్ పురి సినిమాలు చేస్తుందట. మరి దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా పక్కాగా నగ్మా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది అని తెలుస్తుంది. చూద్దాం నగ్మా జీవిత కథా.. లేకుంటే ఇంకెవరైనా హీరోయినా అనేది. మరో రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది.

Lakshmi Rai Says, Juile 2 is Her Own Story:

Lakshmi Rai Reveals Shoking Secret on Juile 2 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs