Advertisement
Google Ads BL

నెటిజన్ల కామెంట్స్ పై తాప్సీ ఎటాక్!


తరుచుగా ఈ మధ్య హీరోయిన్లు ఏదో సంఘసంస్కర్తలుగా, తాము కూడా పది మందితో కలిసి తిరిగి, హీరోలు సిక్స్‌ప్యాక్‌ చూపించినట్లుగా వారి అందాలన్నీ సోషల్‌మీడియాలో పెడుతున్నారు. వారి దృష్టిలో ఇష్టం వచ్చినట్లు తిరగడం, వెధవలుగా ఉన్న మగాళ్ల లాగా వారు కూడా బరితెగించడం, అందాలన్నీ ఆరబోయడం, ఇష్టమైన ఫుడ్‌, సెక్స్‌, డ్రస్‌లు.... ఇవే మహిళా స్వేచ్చగా భావిస్తూ ఆడవారి పట్ల మగవారు మైండ్‌ సెట్‌ మార్చుకోవాలని అంటున్నారు. మహిళాస్వేచ్చను, పురుషాధిక్యాన్ని అందరు ఖండిస్తారు. కానీ విచ్చలవిడితనమే మహిళా స్వేచ్చ అనుకుంటే ఎలా..? ఈ విషయంలో పురుషులతో పాటు మహిళలు కూడా మారాలి. ఆత్మవిశ్వాసం, దేనినైనా ఎదుర్కొనే ధైర్యం, సాహసం వంటివే స్త్రీకి స్వేచ్చగా చెప్పుకోవాలి గానీ గుడ్డలన్నీ తీసేసి చూపిస్తూ, మీ మైండ్‌ సెట్‌ మార్చుకోవాలని సూక్తులు చెప్పడం సరికాదు. 

Advertisement
CJ Advs

ఎప్పుడు మహిళా సాధికారికతను గురించి మాట్లాడే తాప్సీ పన్ను 'జుడ్వా 2'లో బికినీ వేసింది. పోనీ అది సినిమా అని సరిపెట్టుకోవచ్చు. కానీ సోషల్‌ మీడియాలో ఇష్టమొచ్చినట్లు జుగుప్సాకరమైన డ్రస్‌లతో కనిపించడం, ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తాజాగా ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలలో ఎప్పుడు నవ్వుతూ ఉండే తాప్సి కాస్త సీరియస్‌గా ఉండి, స్ట్రాప్‌లెస్‌ టాప్‌ వేసుకుని, పెద్దగా మేకప్‌ లేకుండా కనిపించడంతో అభిమానులు నిన్ను ఇలా చూడలేకపోతున్నాం అంటూ కామెంట్స్‌ పెట్టారు. మరి కొందరు ఇలా విప్పి చూపించబట్టే మహిళల పట్ల మగాళ్లు ఆకర్షితులవుతారు. మరి ఏమంటే హెరాస్‌మెంట్‌ అంటారు అని సెటైర్‌ విసిరాడు. దానికి తాప్సి బదులిస్తూ 'అటువంటప్పుడు మగాళ్లకి ఉండే ఆ రోగం కుదరడానికి తప్పుగా చూసే ధోరణి కుదరడానికి ఒకటి చేయాలి. అంతే తప్ప ఇలాంటి ఫోటోల వల్ల ఏమీ కాదు...సర్లేగానీ ఆరోగ్యానికి ఏదైనా ట్రీట్‌మెంట్‌ తీసుకో'.. అని కౌంటర్‌ ఇచ్చింది. మరో నెటిజన్‌ 'బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవా..? లేదా ఒళ్లంతా చూపించాలని అనుకుంటున్నావా? అని ప్రశ్నిస్తే' నీలాంటి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే వాడు ఎవరూ లేరా? అని తెలుసుకునేందుకే ఈ ఫొటో పెట్టాను. ఈ ఫొటో పెట్టకపోతే వజ్రంలాంటి నువ్వు, నా భావాలు ఉన్నవారు నాకు తెలిసి ఉండేవారు కదా...! అని కౌంటర్‌ ఇచ్చింది. మరో పక్క వరుణ్‌ధావన్‌ వంటి వారు ఆమె ఫొటోని, ఆమె రిప్లైలని చూసి శభాష్ తాప్సి అంటూ కామెంట్స్‌ పెట్టారు. 

Tapsee Pannu Counter on Netizens Comments:

Actress Tapsee Pannu Sensation Replay to who comments on her Photo.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs