తనకు కుటుంబ వ్యవస్థ మీద, సమాజం మీద బాధ్యతలేదని వర్మ ఎప్పుడో చెప్పాడు. ఇక ఆయన చేసే ట్వీట్స్ కూడా అలాగే ఉంటాయి. ఆయనకు ఎవ్వరూ మిత్రులు కాదు.. ఎవ్వరూ శత్రువులు కాదు.. తనకు తోచింది చేస్తూ ఉంటాడు. అలాంటి టిపికల్ క్యారెక్టర్ అయిన వర్మ మొదట్లో చిరుని పొగిడాడు. ఆ తర్వాత ఆయన రాజకీయాలలోకి వచ్చిన తర్వాత సెటైర్లు వేశాడు. పవన్ అంటే ఇష్టమని, ఆయన రాజకీయాలలోకి రావాలని మొదట అన్నది ఆయనే. ఆ తర్వాత పవన్‌ని కూడా వదలలేదు. ఇక 'ఖైదీనెంబర్ 150', 'గౌతమీపుత్ర శాతకర్ణి'ల విషయంలో చిరును ఎద్దేవా చేస్తూ ఆయనకు రీమేక్‌లు తప్ప ఏమీ దొరకలేదా? అంటూ 'గౌతమీ పుత్ర శాతకర్ణి'ని ఆకాశానికి ఎత్తేశాడు. ఆ తర్వాత పూరీజగన్నాథ్, బాలకృష్ణల కాంబినేషన్‌లో వచ్చిన 'పైసావసూల్' స్టంపర్ విడుదలైన తర్వాత అద్బుతం అన్నాడు. ఇప్పుడు నంది అవార్డుల విషయంలో 'కమ్మ' అంటూ బాలయ్యని, బోయపాటిని అందరినీ టార్గెట్ చేశాడు.
డ్రగ్స్ నుంచి 'అర్జున్‌రెడ్డి' వరకు అంతే. అంతకు ముందు ఆయన బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్‌కశ్యప్‌కి బుగ్గల మీద గాఢముద్దు పెడుతోన్న ఫొటోని పోస్ట్ చేశాడు. 'అర్జున్‌రెడ్డి' విషయంలో వి.హన్మంతరావుని టార్గెట్ చేస్తూ అర్జున్‌రెడ్డి హీరోయిన్ నీకు ముద్దివ్వలేదని బాధగా ఉందా..? చిల్ తాతయ్యా.. అంటూ అనురాగ్ కశ్యప్ స్థానంలో విహెచ్‌ని పెట్టి ఆయనకు తాను ముద్దు ఇస్తున్న ఫొటోగా మార్ఫింగ్ చేసి సెటైర్లు వేశాడు. నంది అవార్డులో కూడా ఆయనది డిఫరెంట్ స్టైలే. ఇక 'బాహుబలి' సమయంలో ఆయన రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కానీ ఇప్పుడు అదే జక్కన్నను, అటు పక్క ఇటు పక్క ఉన్న రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల ఫొటోని ఉద్దేశించి... మహిళలను ఆరాధించే నేను ఇలాంటి గే కల్చర్‌ని ప్రోత్సహించనని, ఒక్కరు కాదు... ఇద్దరుకాదు.. ముగ్గురు ఆ టైపేనా... అందునా ముగ్గురు పెళ్లయిన వారు.. అల్లా.. ఏం జరుగుతోంది.. జీసస్ మీరైనా చెప్పండి... బాలాజీ (వేంకటేశ్వరస్వామి) నువ్వైనా చెప్పవా..? అంటూ కామెంట్ చేశాడు. వర్మది టిపికల్ మెంటాలిటీ అని తెలుసుగానీ మరలా ఇంత చీప్‌గా కామెంట్ చేయడం చూస్తే ఇలా'గే'నా స్పందించేది...? అనిపిస్తుంది.
ఇక మహిళలను ఆరాధించే నేను అంటూ తనపై కూడా తాను సెటైర్ వేసుకున్నాడు. దాంతో వర్మ ధోరణి తెలిసిన రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు స్పందించకపోయినా అభిమానులు మాత్రం ఆయనపై మండిపడుతున్నారు. జంతువులాంటి నువ్వు 'గే' ఉండి వారిని అంటావేమిరా.. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ ఇది ఆయన ఏదో సెటైరిక్‌గానే వేసింది తప్ప కావాలని మాట్లాడిన విషయం కాదులే..ఆయన టైప్ తెలిసిందే కదా...! అని మరికొందరు కామ్‌గా ఉంటున్నారు.