Advertisement
Google Ads BL

నాగ్.. లుక్ అదిరిపోయింది..!


రామ్ గోపాల్ వర్మ - నాగార్జున కలయికలో తెరకెక్కబోయే సినిమా ఈ రోజు సోమవారం ఉదయం 10  గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆఫీషియల్ గా మొదలయ్యింది. ఈ సినిమాని నాగ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా మొదటి షాట్ ని రామ్, గోపాల్ వర్మ  తల్లితోపాటు అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్రలు క్లాప్ కొట్టారు. మరి గతంలో నాగార్జున - వర్మ  కలయికలో వచ్చిన శివ సినిమా సెంటిమెంట్ నే వర్మ మరోసారి పాటించాడు.  తనకి ఎటువంటి సెంటిమెంట్ లేదంటూనే ఇప్పుడు తన తల్లితో ఈ సినిమాకి క్లాప్ కొట్టించిన వర్మ ఈ.. సెంటిమెంట్ ని ఏమనాలి. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి వర్మ శిష్యుడు పూరి జగన్నాధ్, జెడి చక్రవర్తి, ఉత్తేజ్ వంటి వారు హాజరయ్యారు. 

Advertisement
CJ Advs

ఈ సినిమాలో నాగార్జున ఎలా ఉండబోతున్నాడో అనే విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియా పేజీ ద్వారా అక్కినేని అభిమానులతోపాటు ప్రేక్షకులందరికీ పరిచయం చేశాడు. ఇంతవరకు నాగార్జుననని ఆ లుక్ లో మనమెప్పుడు చూడలేదేమో అనే లుక్ లో నాగ్ కనబడుతున్నాడు.  చాలా రఫ్ లుక్ లో ఒక చేతిలో గన్.. మరో చేతిలో డబ్బు కట్టలతోవున్న నాగ్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. మరి పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.    

ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన అనుష్క శెట్టి ఎంపికైందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓపెనింగ్ జరిగిన తర్వాత ఆర్జీవీ తాను దేవుణ్ణి అస్సలు నమ్మనని కేవలం నాగార్జునని మాత్రమే నమ్ముతానని... ఎందుకంటే నాగార్జున తనకి శివ సినిమా అవకాశం ఇచ్చాడు. అలాగే ఆ సినిమాతోనే తానొక టాప్ డైరెక్టర్ ని కాగలిగానని... శివ సినిమాకి ముందు తానొక సామాన్యుడునని... శివ సినిమా విషయంలో నాగ్ తనకి పూర్తి స్వేచ్ఛ నిచ్చాడని.... అందుకే నాగ్ తన దృష్టితో దేవుడున్నాడు. మరి వర్మ ఏం చెప్పిన ఒక సెన్సేషనే కదా.

Nagarjuna New Look In Ram Gopal Varma Film:

The sole reason Nagarjuna accepted to do a project with Ram Gopal Varma is he is very much aware of technical expertise and story narrative experience RGV got.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs