Advertisement
Google Ads BL

సూర్య కోసం బన్నీ బాగా కష్టపడుతున్నాడు!


అల్లు అర్జున్ - వక్కంతం వంశీ కలయికలో 'నా పేరు సూర్య…నా ఇల్లు ఇండియా' సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలతో రైటర్ గా పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అయితే 'నా పేరు సూర్య' సినిమా పూర్తిస్థాయి దేశభక్తి కంటెంట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా ఇప్పటికే హైదరాబాద్‌ లో రెండు షెడ్యూళ్లను, ఊటీలో ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. తాజాగా చిత్ర యూనిట్ మొత్తం ఊటీ నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది.

Advertisement
CJ Advs

అయితే ఈ షెడ్యూల్లో కొన్ని ఇంపార్టెంట్ ఫైట్ సీన్స్ షూట్ చేస్తారు అంట. ప్రముఖ స్టంట్ మాస్టర్ రవి వర్మ ఈ ఫైట్ సీన్స్ ను కంపోజ్ చేస్తున్నారట. అల్లు అర్జున్ ఇప్పటికే ఈ ఫైట్ సీన్స్ కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం బన్నీ మంచి బాడీ లాంగ్వేజ్ ని మెయింటింగ్ చేస్తున్నాడనే  విషయం అతని ప్రస్తుత లుక్ ని బట్టి అర్ధమవుతుంది. మరి ఆర్మీ అధికారిగా కనిపించనున్న అల్లు అర్జున్…. లుక్ కోసం యూఎస్ ట్రైనర్ల వద్ద కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడు.  ఆర్మీ ఆఫీసర్ కి ఉండాల్సిన లక్షణాలు బన్నీ సూపర్ గా కనబడుతున్నాయి. 

శిరీష, శ్రీధర్ లగడపాటి, బన్నీ వాసులు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన మొదటిసారి హాట్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ అంటిస్తుంది. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ వంటి సీనియర్ స్టార్ హీరోలు ఈ మూవీలో కీ రోల్స్ లో నటిస్తున్నారు. విశాల్ శేఖర్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. 

Allu Arjun Special Care for Naa Peru Surya Action Part:

High Voltage Action Scenes in Naa Peru Surya Naa illu India
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs