మెగాస్టార్ చిరంజీవి తన 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' ని మాస్ డైరెక్టర్ వివి వినాయక్ చేతిలో పెట్టాడు. ఆ చిత్రంతో తొమ్మిదేళ్ల తన స్థానాన్ని తానే మళ్ళీ భర్తీ చేసే లెవల్లో ఆ సినిమా హిట్ అయ్యింది. అయితే తన 151 వ సినిమా బాధ్యతలను ఏ డైరెక్టర్ కి ఇస్తాడు... అలాగే ఎలాంటి సినిమా చెయ్యబోతున్నాడనే విషయం మీద దాదాపు రెండు మూడు నెలలు తీవ్ర ఉత్కంఠ నడిచింది. అయితే సడన్ గా తన 151 వ చిత్రాన్ని చిరంజీవి కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేతిలో పెట్టి షాక్ ఇచ్చాడు. కామెడీ, కమర్షియల్ చిత్రాల స్పెషలిస్ట్ కి ఇలా ఒక స్వాతంత్ర్య సమరయోధుడు కథని తెరకెక్కించమని చిరు చెప్పడమేమిటి అనే చర్చ కూడా జరిగింది.
అయితే అసలు సురేందర్ రెడ్డి ని చిరంజీవి ఎందుకు డైరెక్టర్ గా తీసుకున్నాడు అనే విషయాన్ని రామ్ చరణ్ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు. అదేమిటంటే సురేందర్ రెడ్డితో నేను చేసిన 'ధృవ' సినిమా ప్రమోషన్ల కోసం అమెరికాకు వెళ్లాం. అక్కడ ఓ సాయంత్రం సురేందర్ తో కలిసి మాట్లాడుతున్నపుడు... ఒకే నీ తర్వాత సినిమా ఏమిటి అని నేను సురేందర్ రెడ్డి ని అడిగాను. దానికి సురేందర్ రెడ్డి.. నాన్నగారి కోసం ఒక కథ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. మరి అందుకు అవకాశముందా అని నన్ను అడిగాడు. హా వర్కౌట్ అవుతుందన్నాడు. నేను వెంటనే నాన్నకు ఫోన్ చేశాను.
అయితే నాన్న అదే సమయంలో పరుచూరి సోదరులతో కలిసి ఉయ్యాలవాడ సినిమాకు సంబంధించి కథా చర్చలు జరుపుతున్నారు. నేను ఫోన్ లో సురేందర్ విషయం చెప్పగానే అయన వచ్చి కలవమన్నారు. నేను సురేందర్ రెడ్డికి నాన్నకి మధ్య మీటింగ్ ఏర్పాటు చేశాను. సురేందర్ రెడ్డికి సినిమా మీద ఉన్న క్లారిటీ నాన్నకి చాలా నచ్చింది. అందుకే నాన్న ఈ ఉయ్యాలవాడ సినిమాకి సురేందర్ రెడ్డిని ఓకే చేశారు అని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. మరి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే నెల అంటే.. డిసెంబర్ 6న సెట్స్ మీదకి వెళ్లనుంది.