Advertisement
Google Ads BL

సుధీర్ బాబు సినిమా నుండి హీరోయిన్ అవుట్!


ఇప్పటి వరకు సుధీర్ బాబు.. మహేష్ బావగానే ఇండస్ట్రీలో గుర్తింపు పొందుతున్నాడు. అందులో నుండి బయటపడడానికి చాలానే ట్రై చేస్తున్నాడు కూడా. అలాగే కెరీర్ లో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సుధీర్ బాబు ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఇప్పుడు కాస్త బిజీ అయ్యాడు. ఇంతకుముందు సుధీర్.. నారా రోహిత్, సందీప్ కిషన్, ఆదిలతో కలిసి 'శమంతకమణి' అనే మల్టీస్టారర్ సినిమాలో నటించాడు. ఆ సినిమా అనుకున్నంత సాధించలేదు. అయితే ఇప్పుడు సుధీర్ బాబు నటించిన నెక్స్ట్ మల్టీ స్టారర్ మూవీ అయిన 'వీర భోగ వసంతరాయలు' రిలీజ్ కి రెడీగా ఉంది. 

Advertisement
CJ Advs

ఇకపోతే తాజాగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాని ఓకే చేసాడు సుధీర్ బాబు. నాని.. జెంటిల్ మెన్ నిర్మాత అయిన శివలెంక ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ అయిన అదితి రావు హైదరిని ఓకే చేసింది చిత్ర బృందం. అసలు సుధీర్ బాబు పక్కన అదితి హీరోయిన్ అనగానే ఈ సినిమాపై ఎక్కడ లేని క్రేజ్ వచ్చి పడింది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం అదితి.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ - సుధీర్ బాబు సినిమా నుంచి తప్పుకుంది అనే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా నుండి అదితి తప్పుకోవడానికి గల కారణం ఆమె అడిగినంత ప్రొడ్యూసర్స్ ఇవ్వకపోవడంతోనే... ఆమె ఈ సినిమా నుండి తప్పుకుందని అంటున్నారు.

మరి ఇప్పుడు ఫైనల్ చేసిన హీరోయిన్ అర్ధాంతరంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో దర్శకుడు మోహన్ కృష్ణ మరో హీరోయిన్ వేటలో పడ్డాడు. మరి హీరోయిన్ సంగతి ఎలా వున్నా వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది.

Aditi Rao Hydari Out From Sudheer Babu Film:

Aditi Rao Hydari Wants High Remuneration for Sudheer Babu and Mohan Krishna Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs