2016వ సంవత్సరానికి గాను ఎన్టీఆర్‌కి ఉత్తమనటుడిగా నంది అవార్డుకి ఎంపిక చేశారు. 'లెజెండ్' చిత్రం విషయంలో రచ్చ రచ్చ జరుగుతున్నా కూడా ఇప్పటివరకు ఎన్టీఆర్‌కి ఉత్తమ నటుడి అవార్డు ఎలా ఇస్తారని విమర్శించే వారే లేరు. దానికి కారణం అందుకు ఆయన అర్హుడే. ఆయనకు ఒక చిత్రానికి కాకుండా రెండు సినిమాలకి కలపి ఉత్తమనటుడిని ఇచ్చారు. అవి 'నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్'లు. ఈ రెండు చిత్రాలలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు.
2015 అవార్డ్స్ విషయంలో మాత్రం బాహుబలి ప్రభాస్ కి అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు. ఈ ఎంపిక చాలా కష్టతరమైన ఎంపికే. ఇక ఆ ఉత్తమనటుడి అవార్డు రెండో భాగానికైనా ఈ ఏడాదికి వస్తుందో లేక 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి బాలయ్యకి ఇస్తారో వేచిచూడాల్సివుంది. ఇక త్వరలోనే ఎన్నికలు రాబోతున్న వేళ పవన్ తమతో ఉంటాడో లేదో తెలియని పక్షంలో టిడిపికి మద్దుతుగా ఎన్టీఆర్‌ని, బాలయ్యని ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించి, ఎన్టీఆర్‌ని మచ్చిక చేసుకునే వ్యూహంలో ఎన్టీఆర్ కి అవార్డు ఇచ్చారని, ఇదంతా చంద్రబాబు వేసిన ఎత్తుగడగా పలువురు భావించడం విడ్డూరం.