Advertisement
Google Ads BL

జీవిత.. ఆ ప్రాసెస్‌ ఏంటో చెప్పొచ్చుగా!


నంది అవార్డుల పుణ్యమా అని ఇండస్ట్రీ కమ్మ, కాపుగా విడిపోయింది. పరిశ్రమ మొత్తం రోడ్దు మీదకొచ్చి మీడియా ముందే బండ బూతులు తిడుతున్నారు. కొందరు వీటిని సైకిల్‌ అవార్డ్సు అంటుంటే మరికొందరు కమ్మ అవార్డ్సు అంటున్నారు. ఈ విషయంలో 2015కు జ్యూరీ చైర్మన్‌ అయిన జీవిత స్పందించారు. మూడు నెలల పాటు అన్ని చిత్రాలను చూసి ఎంతో కష్టపడి మేము అవార్డులని ఎంపిక చేశాం. మా మీద ఏ రాజకీయనాయకుడి ఒత్తిడి లేదు. నెగటివ్‌గా ఆలోచించే వారికి అన్ని తప్పులు గానే కనిపిస్తాయి. ఈ అవార్డుల గురించి ప్రజలు మాట్లాడుకోవడం లేదు. కానీ పరిశ్రమ వారే లైవ్‌ షోలలో పబ్లిగ్గా తిట్టుకుంటూ ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు. వీరి వ్యవహారం నన్నెంతో బాధించింది. 'రుద్రమదేవి' విషయానికి వస్తే ఈ కేటగరిలో ఎంతో పోటీ ఉంది. 

Advertisement
CJ Advs

అన్ని కోణాలలో ఆలోచించే సరైన సినిమాకి ఇచ్చాం. బాగా తీసిన చిత్రాన్ని బాగా లేదని అనడానికి మాకేమైనా సరదానా..? జ్యూరీ ప్రాసెస్‌ ఎలా జరిగిందో తెలియని వారు దాని గురించి ఎందుకు విమర్శిస్తారు...? ఆ అర్హత ఎవ్వరికీ లేదు...సపోర్టింగ్‌ క్యారెక్టర్‌ రోల్‌కి బన్నీని పంపి ఉండవచ్చని కానీ ఎస్వీరంగారావు వంటి గొప్ప ఆర్టిస్ట్‌ పేరుతో ఉన్న క్యారెక్టర్‌ ఆర్టిస్టుకి పంపామని, ఈ విషయాన్ని తాము గర్వంగా భావిస్తున్నామని .. చిరంజీవి, అల్లుఅరవింద్‌, అల్లుఅర్జున్‌ వంటి వారేమి మాట్లాడటం లేదు.. బయటి వారే మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఇక ఆమె టీవీలైవ్ షోలలో పబ్లిగ్గా తిట్టుకుంటూ పరిశ్రమ పరువును బజారుకీడుస్తున్నారని జీవిత అంది. 

అసలు లైవ్‌ షోలలో పబ్లిగ్గా తిట్టుకోవడం అనేది జీవిత, రాజశేఖర్‌ల విషయంలోనే మొదటిసారిగా జరిగి ఇండస్ట్రీ పరువు పోయింది. ఇక జ్యూరీ ప్రాసెస్‌ తెలియని వారికి మాట్లాడే అర్హత లేదంది. మరి ఈ జ్యూరీ ప్రాసెస్‌ ఏమిటో? ఆమెను చెప్పమను. ఇక అర్హతల గురించి మాట్లాడుతోంది. జ్యూరీకి చైర్మన్‌గా అయ్యే అర్హత జీవితకి ఏముంది? ఇక బన్నీ విషయంలో ఆమె చెప్పింది కరెక్టే. కానీ 'రుద్రమదేవి' కేటగరిలో దానికి తీవ్ర పోటీ ఇచ్చిన చిత్రాలు ఏవేవో మొత్తం లిస్ట్‌ని బయటపెడితే ప్రజలే నిర్ణయిస్తారు. ఇక ఒక విషయంలో మాత్రం మెగా ఫేవరేట్స్‌ ముసలి వారికి, రిటైరయిన వారికి ఇచ్చే రఘుపతి వెంకయ్య అవార్డును చిరంజీవికి ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. దేశంలో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఎంతదో, రాష్ట్రంలో రఘుపతి వెంకయ్య అవార్డు అంత ప్రతిష్ట కలిగింది. కాబట్టి రఘుపతి వెంకయ్య అవార్డును చిరంజీవికి ఇవ్వడం సరికాదని వాదించడం తప్పే. 

Jeevitha Fires on Nandi Awards Haters:

Jeevitha Clarity About Nandi Awards Juery Selection
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs