దేశవిభజన సమయంలో ఇండియా పాకిస్థాన్‌కి చెందిన వారి మధ్య ఉండే పంతాలు, పట్టింపులు, విభజనలు, ప్రేమలు, అలాగే ఇండియా చైనా యుద్ధం సమయంలో రెండు దేశాల ప్రేమజంటలకు ఎదురయ్యే అవాంతరాలపై ఇప్పటికే బాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలు వచ్చాయి. ఇక కొన్ని చిత్రాలలో తమిళనాడు, కర్ణాటక బోర్డర్‌లో ఉండే ఉద్రిక్తతలు, ప్రేమలపై చిత్రాలు వచ్చాయి. మన తెలుగులో రెండు గ్రామాల మధ్య ఉండే పంతాలు, పట్టింపులు వంటి కథలతో 'బృందావనం, అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' వంటి చిత్రాలు చూశాం. ఇప్పుడు ఏపీ, తమిళనాడు బోర్డర్‌లోని రెండు గ్రామాల మధ్య కంచె వేశారు. ఆ ఊరు తమిళనాడుదైతే, పక్కఊరు ఆంద్రప్రదేశ్‌ది.
ఈ పాయింట్ ఆధారంగా నాగశౌర్య, రష్మిక మండన కాంబినేషన్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ శిష్యుడైన వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఛలో'. ఈ చిత్రం టీజర్‌ని త్రివిక్రమ్ చేతులు మీదుగానే ప్రారంభించారు. ఈ టీజర్‌లో నాగశౌర్య క్లాస్‌లుక్‌తో పాటు కాస్త మాస్ లుక్‌తో కూడా ఉన్నాడు. ముఖ్యంగా 'గొడవలంటే నాకూ ఇష్టమేరా..కానీ ఈ ఇడ్లీసాంబార్ కోసం కొట్టేసుకోవడం ఏమిటిరా'? అని తమిళతంబీలపై పంచ్ బాగానే పేల్చాడు. మొత్తానికి ఈ చిత్రమైన నాగశౌర్యని బాగా నిలబెడుతుందో లేదో వేచిచూడాల్సివుంది.. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.