లేడీ సూపర్‌స్టార్‌గా, లేడీ అమితాబ్‌గా 'కర్తవ్యం, పోలీస్‌లాకప్, ఆశయం, ఒసేయ్‌రాములమ్మ' వంటి చిత్రాల ద్వారా తనకు వచ్చిన విపరీతమైన ఫాలోయింగ్‌ని అడ్డుపెట్టుకుని, ఇక వయసు మీరి పోతుండటంతో చాలా కాలం తన పెళ్లి విషయాన్ని, భర్త విషయాన్ని దాచి పెట్టిన విజయశాంతి ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంటర్ అయింది. ఇక స్టార్ నటులైతే సినిమా తర్వాత ఏమిటి? అంటే పాలిటిక్స్ అనేచెప్పాలి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన నాటిసమైక్యాంధ్రలో ఎన్టీఆర్ నుంచి చిరంజీవి. పవన్‌లతో పాటు సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల, పోసాని, శివాజీ, సీనియర్ నరేష్ వరకు అందరూ పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఇక తమిళనాట అన్నాదురై నుంచి ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత వరకు కూడా ముఖ్యమంత్రులయ్యారు. ఇక కన్నడనాట స్టార్స్ రాజకీయాలలోకి వచ్చి బాగానే రాణిస్తున్నారు. ఇక తమిళంలో రాధిక, ఖుష్బూ, నగ్మా వంటి వారు కూడా రాజకీయాలలోకి ప్రవేశించారు. కానీ వీరెవ్వరు రాణించలేకపోయారు. విజయశాంతిది కూడా అదే బాట.
ఇక ప్రస్తుతం తమిళంలో రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి వారు కూడా రాజకీయాలలోకి వస్తున్నారు. కానీ జయలలిత తప్ప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నటీమణులు తక్కువే. ఇక తాజాగా నయనతార కూడా రాజకీయాలలోకి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈమె దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుని ఓ ఇంట్లో కలిసే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆమె ఈమధ్య ఎక్కువగా అంటే 'మయూరి' నుంచి ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తోంది. తాజాగా వచ్చిన 'ఆరమ్' చిత్రం తమిళనాట రికార్డులు బద్దలు కొడుతోంది. ఇందులో నిజాయితీ కలిగిన కలెక్టర్ పాత్రలో సిన్సియర్‌గా పనిచేసే అధికారి అవినీతి, స్వార్ద నాయకుల వల్ల ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవకే అంకితమవుతుంది. ఈ చిత్రం కల్పిత కథే అయినా తమిళనాడు రాజకీయాలలో కూడా సంచలనంగా మారింది. ఇక ఇప్పటికే అదే దర్శకునిగా ఆమె 'ఆరమ్‌౨' చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇందులో కలెక్టర్ ఉద్యోగాన్ని వదులుకున్న తర్వాత ప్రజాసేవతో ఎమ్మెల్యే నుంచి సీఎం అయ్యే దాకా ఆమెని మరింత పవర్‌ఫుల్‌గా చూపించనున్నారట ఇక ఆమె ఎంతో కాలం తన పెళ్లి విషయం దాయలేదు. ఇప్పటికీ అవకాశాలు వస్తున్నా కూడా వయసు మీద పడుతోంది. సో.. ఆమె తదుపరి లక్ష్యం రాజకీయాలే అంటున్నారు. అయినా సొంతగా పార్టీ పెట్టి ముఖ్య మంత్రి అయ్యే సీన్ లేకపోయినా ఏదో పార్టీలో చేరి అసెంబ్లీలోనో, పార్లమెంట్‌లోనో అధ్యక్షా అని పిలిపించుకునే స్థాయికైనా ఎదుగుతుందా? లేదా? అనేది వేచిచూడాలి. మొత్తానికి ఇప్పుడే కాకపోయినా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి నయనతో పాటు పెళ్లి చేసుకుంటున్న నమితకూడా తమ అదృష్టాలను పరీక్షించుకోవచ్చని చెప్పాలి.