Advertisement
Google Ads BL

పవన్ 'అజ్ఞాతవాసి' అదుపుతప్పుతోందా?


పవన్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రం షూటింగ్ పూర్తికావచ్చిందనే అనుకున్నారు అందరూ. తాజాగా బల్గేరియాలో జరిగిన షెడ్యూల్ తో టోటల్ సినిమా షూటింగ్  అయిపోయిందని జనాలు ఊహించేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి అటుఇటుగా వంద కోట్లు మార్క్ టచ్ చేసిందనే టాక్ ఉండనే ఉంది. మరి బల్గేరియా షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తయితే నిర్మాతకు కాస్త రిలీఫ్ దొరికేది. ఎప్పుడో పూర్తి కావాల్సిన షూటింగ్ మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉండడంతో నిర్మాతకు ఈ సినిమా మరింత భారాన్ని పెంచేసిందట.

Advertisement
CJ Advs

బల్గేరియాలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చింది చిత్ర బృందం. కానీ పవన్ మాత్రం ఒక అవార్డు అందుకోవడం కోసం లండన్ వెళ్లాడు. అయితే పవన్ లండన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే 'అజ్ఞాతవాసి' సినిమాకు సంబంధించి మరో భారీ షెడ్యూల్ ప్రారంభమవుతుందని మాట వినబడుతుంది. అయితే ఆ భారీ షెడ్యూల్ దాదాపు ఈనెలాఖరు వరకు ఉంటుందట. మరి ఈనెలాఖరు వరకు షూటింగ్ అంటే మరి ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. షూటింగ్ అంటే రోజుకు ఖర్చు లక్షల్లో ఉంటుంది. ఇప్పటికే వంద కోట్లు బడ్జెట్ టచ్ చేసిన సినిమాకు ఇంకా 15 రోజులు షెడ్యూల్ అంటే.. ఇంకెంత భారమో ఊహించుకోవచ్చు.

ఈ నిర్మాతకు మాత్రం తడిసి మోపుడవుతుంది. అది మాత్రం పక్కా. మరి పవన్ - త్రివిక్రమ్ సినిమా మీద బోలెడన్ని అంచాలనున్నాయి. అలాగే  ప్రీ - రిలీజ్ బిజినెస్ అటు ఇటుగా 130 కోట్ల రూపాయల వరకు పూర్తయింది కాబట్టి.. ప్రస్తుతానికి అయితే నిర్మాత సేఫ్. సినిమా మాత్రం ఏమైనా తేడాకొట్టిందా బయ్యర్లు మాత్రం అడ్డంగా బుక్ అయిపోవడం ఖాయం.

Pawan and Trivkram Movie Out of Budget:

Pawan Kalyan and Trivikram Srinivas Film Budget Limits Crossed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs