Advertisement
Google Ads BL

'ఛలో' టీజర్: అంతా గొడవే..!


ప్రస్తుతం టాలీవుడ్ లో మిడిల్ రేంజ్ హీరోస్ మధ్య పోటీ చాలా గట్టిగా వుంది. అందుకే అందరు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులకు దగ్గర అవ్వుదాం అని చూస్తున్నారు. 'కథలో రాజకుమారి' చిత్రం తర్వాత మళ్ళీ 'ఛలో' అంటూ మన మధ్యకు వస్తున్నాడు హీరో నాగ శౌర్య. 

Advertisement
CJ Advs

ఆంధ్ర మరియు తమిళనాడు బోర్డర్ లో సాగే స్టోరీ ఇది. అయితే ఈ సినిమా టీజర్ నవంబర్ 18 న విడుదల అయింది. తిరుప్పురం, ఆంధ్ర - తమిళనాడు బోర్డర్ లో వున్న ఊరు.. 1953 లో తమిళనాడు నుండి ఆంధ్ర విడిపోయినప్పుడు ఆ విభజన రేఖ ఊరు మధ్యనుంచి వెళ్ళింది. అప్పటి నుండి ఒక వైపు తమిళ్ వాళ్లు..మరో వైపు తెలుగు వాళ్ళు అంటూ నారా రోహిత్ వాయిస్ ఓవర్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. నాగ శౌర్య ఈ టీజర్ లో స్టైలిష్ గా కనిపించాడు. ఒక ప్రక్కన క్లాస్ గా కనిపిస్తూనే మరో ప్రక్కన మాస్ కూడా ప్రయత్నించాడు. గొడవలంటే నాక్కూడా ఇష్టమేరా.. కాని ఇలా ఇడ్లీ సాంబార్ కోసం కొట్టేసుకోవడం ఏంటి అంటూ తమిళ తంబీలపై గట్టి పంచులే పేల్చాడు.

తొలి సారిగా టాలీవుడ్ లోకి పరిచయం అవుతున్న రష్మికా మడోన్నా..... కనిపించిన రెండు ఫ్రేమ్స్ లోనే అయిన బాగానే ఇంప్రెస్ చేసింది. కొత్తమ్మాయిలా కాకుండా మనకు ఎంతో తెలిసిన పిల్లలా కనబడుతుంది. ఈ సినిమా ఫోటోగ్రఫీ కూడా బాగుంది. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ కొడుకు మహతి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి అదనపు బలం. ఓవరాల్ గా నాగ శౌర్య ఈసారి చాలా ఇంప్రెస్ చేస్తున్నాడు. మరి బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తాడో చూడాలి.

Click Here To See The Trailer

Chalo Movie Teaser Released:

Chalo teaser of length 1 minute is released just a while back on the hands of Trivikram Srinivas.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs