Advertisement
Google Ads BL

ఈ నిర్మాత.. త్రిషకి గట్టిగా ఇచ్చాడు !


త్రిష సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్ళకి పైమాటే అయ్యింది. ఈ మధ్యలో త్రిష అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. ఈ మధ్య కాస్త స్టార్ హీరోల పక్కన అవకాశాలు తగ్గినా కూడా లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటుతుంది. అయితే త్రిష ఇన్నేళ్ల కెరీర్ లో.. ఆమెపై కొన్ని గాసిప్స్ ప్రచారం జరిగినప్పటికీ.... ఆమెని ఇండస్ట్రీలోఒక ప్రొడ్యూసర్ నుండి గాని, డైరెక్టర్ నుండి గాని ఎప్పుడు ఎలాంటి విమర్శలు ఎదుర్కోలేదు. అసలు దర్శకనిర్మాతలు ఎప్పుడు త్రిషని ఒక్క మాట అన్నట్టుగా ఎక్కడ న్యూస్ కూడా లేదు. అంతేకాకూండా త్రిషని వారు పబ్లిక్ లో తిట్టడం గాని విమర్శించడం గాని జరగలేదు. 

Advertisement
CJ Advs

కాని ఇప్పుడు తాజాగా త్రిషని తొలిసారి ఒక తమిళ స్టార్ ప్రొడ్యూసర్ పబ్లిక్ గానే తిట్టేసాడు. అంతలా త్రిషని ఆ ప్రొడ్యూసర్ విమర్శించడానికి గల కారణం ఏమిటంటే....  త్రిష తాజాగా హరి - విక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న 'సామి' మూవీకి సీక్వెల్ గా వస్తున్న 'సామి2 ' నుంచి బయటకొచ్చేసింది. విక్రం హీరో గా నటిస్తున్న ఈ సినిమా దర్శకుడు హరి తో మనస్పర్దలు రావడంతో ఆ సినిమా నుంచి త్రిష తప్పుకుందని ప్రచారం జరిగింది. ఆమె అలా ఆ సినిమా నుండి బయటికెళ్ళగానే... చిత్ర బృందం తన సినిమాలోకి కీర్తి సురేష్ ని తీసుకున్నారు అది వేరే విషయం.

అయితే  త్రిష ఆ సినిమా నుండి తప్పుకున్న చాలా రోజులకి తమిళ్ లో టాప్ ప్రొడ్యూసర్ అయిన జ్ఞానవేల్ రాజా త్రిష ని పబ్లిక్ లో ఇన్ డైరెక్ట్ గా ఏకిపాడేశాడు. తమిళ్ లో జరిగిన ఒక సినిమా ఆడియో లాంచ్ కి వెళ్లిన  జ్ఞానవేల్ రాజా.. త్రిష పేరు ఎత్తకుండా త్రిషని  ఇన్ డైరెక్ట్ గా తిట్టేశాడు. ఒక సినిమా షూటింగ్ నుంచి హీరోయిన్ వాకౌట్ చేస్తే… చర్చల కోసం ఆమె ఉండే హోటల్ కు వెళ్లి.. దాదాపు 10 గంటల పాటు వెయిట్ చేసినా కనీసం మాట్లాడలేదని.... అలాంటి మహానుభావులు మరికొందరు కూడా  తమిళ సినీ పరిశ్రమలో ఉన్నారని, చేసే పనికి గౌరవం ఇవ్వని ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం కూడా ఉండటం చాలా బాధాకరమని అన్నారు. మరి ఇది త్రిషని ఉద్దేశించి అన్నాడని విషయం ఆ ఆడియో కి హాజరైన అందరికి అర్ధమయ్యింది. మరి ఈ విషయాన్ని త్రిష ఎలా స్వీకరిస్తుందో  చూడాలి.

Saami 2 Producer Fires on Trisha :

Saami Sequel, Producer left and Right to Trisha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs