Advertisement
Google Ads BL

భరత్ తో కొరటాల ఏం మెసేజ్ ఇస్తున్నాడో తెలుసా?


'మిర్చి' సినిమాతో దర్శకుడిగా తానేమిటో... నిరూపించుకున్నాడు కొరటాల శివ. ప్రతి మూవీలో కమర్షియల్ హంగులతో పాటు మంచి సోషల్ మెసేజ్ ని ఇస్తూ ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు కొరటాల. కమర్షియల్ మూవీస్ లో మెసేజ్ ఇవ్వటం కష్టమే కానీ... కమర్షియల్ పాయింట్ ని ఎక్కడ మిస్ కాకుండా సామాజిక అంశాన్ని జోడిస్తాడు శివ.

Advertisement
CJ Advs

'మిర్చి' సినిమాతో మనుషుల్లో మానవత్వాన్ని, 'శ్రీమంతుడు' సినిమాతో ఊరు గొప్పతనం గురించి, 'జనతా గ్యారేజ్' సినిమాతో పరిసరాల గురించి ఇలా ఏదో ఒక మెసేజ్ ఇస్తుంటాడు శివ. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా శివ డైరెక్ట్ చేస్తున్న 'భరత్ అనే నేను' సినిమాలో కూడా ప్రస్తుత విద్యావ్యవస్థ గురించి ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వబోతున్నాడంట.

ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రని పోషిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు విద్యావ్యవస్థ గురించి మాట్లాడే సీన్స్ సినిమాకే హైలెట్  గా నిలుస్తాయని చిత్ర బృందం చెబుతున్నారు. మరి ఇప్పటికే భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఎటువంటి రికార్డ్స్ సృష్టిస్తుందో... చూడాలి. ఆల్రెడీ మహేష్ - శివ కాంబినేషన్ లో వచ్చిన 'శ్రీమంతుడు' మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరి ఈ సినిమాతో కూడా అదే రిపీట్ అవుతుందని... మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Strong Message in Mahesh and Koratala Siva Film :

Koratala Siva Targets Education System in Bharath Ane Nenu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs