Advertisement
Google Ads BL

చిరంజీవి సినీ కెరియర్లో తొలిసారి టెస్ట్!


మెగా ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన్తున్న చిత్రం 'సైరా నరసింహరెడ్డి'. ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 6 నుండి మొదలుకానుంది.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రామ్ చరణ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాతో ఎలాగైనా దేశవ్యాప్త గుర్తింపు సాధించాలని తహతహలాడుతున్న చిరుకి ఒక సందేహం కలిగిందట. అదేమిటంటే.. సురేందర్ రెడ్డి కమర్షియల్ డైరెక్టర్. మరి ఈ సైరా చిత్రమేమో చారిత్రాత్మక చిత్రం. కాబట్టి సురేందర్ రెడ్డి ఈ సినిమాను ఎలా హ్యాండిల్ చేయగలడు? అని చిరుతో పాటు అందరిలోను ఈ అనుమానం ముందు నుండే ఉంది.

Advertisement
CJ Advs

అందుకే తాజాగా చిరు ఈ సినిమా కోసం మొట్టమొదటిసారిగా తన కెరీర్ లో టెస్ట్ షూట్ లో పాల్గొన్నాడు. చిరు రెండు రోజుల పాటు డైరెక్టర్ చేత కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను టెస్ట్ షూట్ చేయించాడట. ఇక తాను కూడా ఆ పాత్రకి తగినట్లుగా కాస్ట్యూమ్ తో షూట్ లో పాల్గొని ఒకసారి తన లుక్ ని అంతా చెక్ చేసుకున్నాడట చిరు. మొత్తానికి సురేందర్ రెడ్డి వర్క్  మరియు తన కాన్ఫిడెన్స్ ని చూసి చిరు సంతృప్తి చెందారనే టాక్ వినబడుతుంది.

ఇక ధైర్యంగా షూటింగ్ ని స్టార్ట్ చేయొచ్చు అని నిర్ణయంచుకున్నారని కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చిరుతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి, కోలీవుడ్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు.

Chiranjeevi's screen test for Sye Raa:

Chiru requested Surender Reddy to go for a screen test on him and also test shoot few important scenes.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs