Advertisement
Google Ads BL

జ్యోతికతో బూతులు చెప్పించారు..!


తెలుగులో బూతు డైలాగ్స్‌ చెప్పిన సినిమాలు, విశృంఖలత్వాన్ని జోడించి హాస్యం పేరుతో అందరినీ వెకిలించేలా సీన్స్‌ కూడా వస్తుంటాయి. ఒకప్పుడు మారుతి అదే దోవలో నడిచాడు. ఇక కొన్ని చిత్రాలలో మొదటి అక్షరం, లేదా రెండు అక్షరాలని వినిపించి, మిగిలిన బూత్‌ని మ్యూట్‌ చేసినా కూడా ఆ ఒకటి లేదా రెండు అక్షరాల వల్ల, ఆర్టిస్టుల లిప్‌ సింగ్‌ వల్ల అవి ఏమిటో జనాలకు బాగానే అర్ధమవుతున్నాయి. ఇక ఇటీవల వచ్చిన 'అర్జున్‌రెడ్డి'ని ప్రేక్షకులు నెత్తిమీద పెట్టుకున్నారు. అందులోని బూతు డైలాగ్‌ని తెలుగులో కాకుండా హైదరాబాదీ హిందీ భాషలో ఆ బూతును వాడారు. అంతేకాదు.. ఈ చిత్రం వేడుకలో ఆ డైలాగ్‌ని హీరో స్వయంగా చెప్పి, వచ్చిన ఆడియన్స్‌ చేత కూడా ఆడిటోరియంలో ఆ పదం పలికించాడు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే తమిళ దర్శకుడు బాల చిత్రాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. మన కన్నా తమిళులకు ఇంకా బాగా తెలుసు. తెలుగు ఆడియన్స్‌కి కూడా 'శివపుత్రుడు, నేనే దేవుణ్ని, వాడు వీడు' వంటి చిత్రాలు వచ్చి బాగా విజయం సాధించాయి. ఆయన చిత్రాలలో సాధ్యమైనంత వరకు రియలిస్టిక్‌గా ఉండేలా చూసుకున్నాడు. ఇక దేశంలోనే దిగ్గజ దర్శకుడైన శంకర్‌ కూడా బాల తీసినట్లు సినిమాలను ఈ ప్రపంచంలో ఎవ్వరూ తీయలేడని ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా ప్రస్తుతం బాల వెటరన్‌ హీరోయిన్‌, స్టార్‌ సూర్య శ్రీమతి జ్యోతిక, సంగీత దర్శకుడు కం హీరో అయిన జివి ప్రకాష్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రం పేరు 'నాచియర్‌'. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని బాల విడుదల చేశాడు. ఇందులో జీవి ప్రకాష్‌ మురికి వాడల్లో ఉండే చిన్న దొంగగా, జ్యోతిక కరుడు కట్టిన క్రూరమైన ఎస్సై పాత్రని చేసింది. కిల్లర్‌గా కనిపిస్తున్న ఆమె చేసే అరాచకాలు అన్ని ఇన్ని కావని టీజర్‌ని చూస్తుంటేనే అర్ధమవుతోంది. 

కాగా ఈ టీజర్‌లో కేవలం జ్యోతిక చెప్పే ఒకే ఒక్క డైలాగ్‌ని చూపించారు. ఆ డైలాగ్‌లో ఆమె 'లం. కొడకా' అని డైలాగ్‌ని చెప్పింది. దీంతో ఈ చిత్రంపై ఇప్పటినుంచే విమర్శలు మొదలయ్యాయి. ఈ బూతుని ఎలా చెప్పిస్తారు? అంటూ టీజర్‌, ట్రైలర్స్‌కి కూడా సెన్సార్‌ చేయాలనే నిబంధన విధించాలని కొందరు కోరుతున్నారు. అవసరంలేని చిత్రాలలో అలాంటి డైలాగ్స్‌ని చూపిస్తే భలే ఉంది అనుకునే బాపత్తు మాత్రం బాల వంటి రియలిస్టిక్‌ డైరెక్టర్‌ చేస్తున్న చిత్రంలోని డైలాగ్‌కి మండిపడుతున్నారు. తెలుగులో కూడా డబ్‌ కానున్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఆ బూతుని సెన్సార్‌ అంగీకరిస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...! 

Jyothika Dialogue in Nachiyar Teaser Creates Sensation:

Nachiyar Jyothika's Dialogue Controversy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs