శంకర్ సంగతి అందరికీ తెలిసిందే. ఒకవైపు 'గౌతమీపుత్రశాతకర్ణి' వంటి హిస్టారికల్, గ్రాఫిక్స్, విజువల్ వండర్స్, యుద్ద విన్యాసాలు ఉండే చిత్రాన్ని క్రిష్ 79రోజుల్లో పూర్తి చేస్తే మన రాజమౌళి మాత్రం 'బాహుబలి' రెండు పార్ట్‌లకి కలిపి ఐదేళ్ల సమయం వెచ్చించాడు. అందుకే ఆయనకు జక్కన్న అనే బిరుదు స్థిరపడిపోయింది. ఇక క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కూడా అంతే.. చెక్కిందే చెక్కుతుంటాడు. వీరి చిత్రాలు ముందుగా చెప్పిన డేట్‌కి వస్తాయో రావో ఎవ్వరూ చెప్పలేరు. ఈ జాబితాలో తొలిపేరు శంకర్‌కే కేటాయించవచ్చు. ఆయన గతంలో తాను తీసిన అన్ని చిత్రాలకు రెండేళ్లకు పైగా సమయం తీసుకున్నాడు.
ఇక 'త్రీ ఇడియట్స్' రీమేక్‌ని కూడా రెండేళ్లు తీశాడు. మరోపక్క '2.0'ని జనవరి 25 నుంచి ఏప్రిల్ 13కి పోస్ట్‌పోన్ చేయడంతో ఈ చిత్రం కోసం ఆయన కేటాయించిన సమయం మూడేళ్లు అవుతుంది. ఇక ఈ '2.0' తర్వాత కమల్‌హాసన్ పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడేలా 'ఇండియన్( భారతీయుడు)2'ని తీయనున్నాడు. 2019 ద్వితీయార్ధంలో సార్వత్రిక ఎన్నికలు వస్తాయి. అదే సమయంలో ముందుగా కూడా ఎలక్షన్లకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే శంకర్ 'భారతీయుడు 2'ని ఎప్పుడు మొదలు పెట్టి, ఎప్పుడు రిలీజ్ చేయాలి? మార్చిలోగానీ శంకర్ ప్రీ కాడు. అప్పటి దాకానే కాదు.. ఆ తర్వాత కూడా కొంతకాలం కేవలం '2.0'కి కేటాయించాల్సి వస్తుంది. దీంతో కమల్ పొలిటికల్ మైలేజ్‌కి అనుగుణంగా ఈ చిత్రం ఎన్నికల లోపు వస్తుందా? లేక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికైనా వస్తుందా? అనేది ఇంతకాలం అందరి సందేహం.
ఇక 'భారతీయుడు' మొదటి భాగాన్నే శంకర్ రెండున్నర ఏళ్లు తీశాడు. ఇక ఈ చిత్రంలో ముసలి కమల్‌హాసన్‌కి చేసే మేకప్ వేయడానికి, తీయడానికే రోజులో సగం గడిచిపోతుంది. కానీ శంకర్ మాత్రం ఈ చిత్రాన్ని 2018 మార్చిలో మొదలుపెట్టి, 2019 మార్చిలో ఎన్నికల లోపే రిలీజ్ చేస్తాడట. 10నెలల్లో షూటింగ్ చేసి ఏడాదిలోపు విడుదల చేస్తానని చెబుతున్నాడు. మరి ఇది కుదిరే పనేనా? అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.