Advertisement
Google Ads BL

భాన్సువాడ భానుమతి గట్సే వేరు...!


సాధారణంగా ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉంటూ టాప్‌స్టార్‌ హీరోయిన్స్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్లు సైతం తల్లి పాత్రలను చేయడానికి ఒప్పుకోరు. ఇక ఈ సాహసమే 'ఫిదా' లోని భాన్సువాడ భానుమతి సాయిపల్లవి చేస్తోంది. మూడు చిత్రాలతోనే ఆమె తన నటనపై తనకేకాదు.. దర్శకనిర్మాతలకు కూడా ఎక్కడ లేని నమ్మకం కలిగిస్తోంది. దాంతో కొందరు సాయిపల్లవిని దృష్టిలో పెట్టుకునే కథలు రాస్తున్నారు. అలాంటి ఓ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నాగశౌర్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్‌గా 'కణం' అనే చిత్రం నిర్మితమవుతోంది. 

Advertisement
CJ Advs

ఇందులో సాయిపల్లవి నాలుగేళ్ల పాపకు తల్లిగా నటిస్తోంది. అందుకే ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌లో కూడా తన కౌగిలిలో పాపను హత్తుకుని ఉన్న సాయిపల్లవి కనిపిస్తోంది. ఈ చిత్రంతో సాయిపల్లవి మరో మెట్టు పైకెదుగుతుందని, ఆమె నటన అద్భుతమని యూనిట్‌ అంటోంది. ఎమోషనల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రభుదేవా 18వ తేదీ సాయంత్రం 5గంటలకు తన ట్విట్టర్‌ ద్వారా రిలీజ్‌ చేయనున్నాడు. కాగా ఈచిత్రం డిసెంబర్‌లో రిలీజ్‌ చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఒకే ఒక్క చిత్రం 'ఫిదా'తో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న సాయిపల్లవికి ఇది రెండో చిత్రం అవుతుందా? లేక దిల్‌రాజు నిర్మాణంలో, వేణుశ్రీరాం దర్శకత్వంలో నాని, సాయిపల్లవి కలిసి నటిస్తోన్న 'ఎంసీఏ' చిత్రం ముందుగా విడుదలవుతుందా? అనేది వేచిచూడాలి. 

ఈ రెండింటిలో ఏ చిత్రం ముందు విడుదలైతే చాలా రకాలుగా సాయిపల్లవి వల్ల ఆ చిత్రానికి ప్లస్‌ పాయింట్‌ అవుతుందనే చెప్పాలి. ఇక ఇప్పటికే మలయాళం, తెలుగులో నటించిన సాయిపల్లవి తన మాతృభాషైన తమిళంలో చేస్తున్న మొదటి స్ట్రెయిట్‌ చిత్రం ఇదే కావడం విశేషం. 

Fidaa Heroine in Mother Role:

Sai Pallavi Plays Mother Role in Kanam Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs