Advertisement
Google Ads BL

గుణశేఖర్‌ కి ఏం సమాధానం చెప్తారు?


తెలుగులో హిస్టారికల్‌ చిత్రాలు చాలా తక్కువ. అలాంటిది ఓ వీరనారి రుద్రమదేవి జీవితగాధను భారీబడ్జెట్‌తో తానే స్వీయనిర్మాణంలో తెరకెక్కించిన గుణశేఖర్‌ నిజంగా అభినందనీయుడు. కానీ ఏపీప్రభుత్వం ఈచిత్రానికి ఏ కేటగిరిలోనూ అవార్డు ఇవ్వకపోవడంతో బాధపడిన గుణశేఖర్‌ తీవ్ర ఆవేదనను, కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. సినిమాకి లాభాలు రాకపోయినా కనీసం అవార్డు చిత్రంగానైనా నిలుస్తుందని గుణశేఖర్‌ భావించాడు. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. దాంతో ఆయన తాజాగా ట్వీట్‌లో తన కామెంట్స్‌ని పోస్ట్‌ చేశాడు. 

Advertisement
CJ Advs

అసలు 'రుద్రమదేవి'కి పన్ను మినహాయింపు ఇవ్వలేదని ప్రశ్నించడం తప్పా? ఈ చిత్రానికి మూడు కేటగిరిలలో అవార్డు రాకపోవడం, కనీసం జ్యూరీకి కూడా ఎంపిక కాకపోవడం చాలా దురదృష్టకరం. ఎవడో ఒకడు చరిత్రను పరిశోధించిన సినిమా తీశాడు. ఇప్పుడు ఆ తీసిన వాడికి అవార్డును ఇచ్చి మరలా చరిత్రను గుర్తుకు తేవడం ఎందుకు? అని భావించారా? అని సెటైర్‌ వేశాడు. చివరగా 'రుద్రమదేవి' వంటి సినిమాను తీసినందుకు క్షమించండి..ఇప్పుడు మరలా వాటిపై మాట్లాడితే మరో మూడేళ్లు బ్యాన్‌ విధిస్తామని ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వమే బెదిరిస్తోందని, ఏపీలోని వాక్‌స్వాతంత్య్రానికి దీనిని ఓ నిదర్శనగా చెప్పవచ్చని కొందరు విమర్శిస్తున్నారు. 

ఇక ఈ చిత్రాన్ని కేవలం తెలంగాణ చిత్రంగా భావించారా? అని కొందరు వచ్చే ఏడాది మాత్రం మరో హిస్టారికల్‌ చిత్రమైన బాలయ్య 'గౌతమీపుత్రశాతకర్ణి'కి అవార్డు ఖాయమని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ఎంతో వినూత్నమైన, కొత్తదనం కలిగిన, ఇంటెలిజెంట్‌ స్క్రీన్‌ప్లేతో సకుటుంబసపరివార సమేతంగా చూసిన 'మనం' చిత్రాన్ని కాదని, రక్త హింసపాతం కలిగిన కేవలం కమర్షియల్‌ చిత్రమైన 'లెజెండ్‌'కి పెద్ద పీట వేయడం వెనుక బాలకృష్ణకి, నాగార్జునలకు ఉన్న వైరం కారణమని అంటున్నారు. 

Gunasekhar's Thought Provoking Questions to TDP:

Gunasekhar's Open Letter to TDP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs