Advertisement
Google Ads BL

ఆమెతో గ్యాప్‌ గురించి ఆర్పీ ఇలా చెప్పాడు!


తేజ-ఆర్పీపట్నాయక్‌-కులశేఖర్‌ల కాంబినేషన్‌లో 'చిత్రం, నువ్వునేను, జయం, నిజం' ఇలా ఎన్నో చిత్రాలు వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. కానీ ఆ తర్వాత రచయిత కులశేఖర్‌ని తేజ వదిలేశాడు. దాంతో మానసిక రోగిగా మారిపోయిన కులశేఖర్‌ ఒక గుడిలోని వెండి వస్తువులను దొంగలించాడనే ఆరోపణతో తెరమరుగయ్యాడు. ఇక ఆ తర్వాత తేజ.. ఆర్పీ పట్నాయక్‌తో కూడా అలాగే వ్యవహరించాడు. తేజ దర్శకత్యంలో ఆర్పీ సంగీత దర్శకునిగా ఓ సంస్థ నిర్మించే చిత్రం కోసం ఆర్పీపట్నాయక్‌కి చాలా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్‌ ఇస్తానని నిర్మాత చెప్పడంతో ఆ విషయాన్ని ఆర్పీపట్నాయక్‌ తేజ దృష్టిని తీసుకొని వచ్చాడు.అప్పటికే తేజ కూడా ఫ్లాప్‌ల్లోనే ఉన్నాడు. కానీ తేజ మాత్రం పొగరుతో నీకున్న సక్సెస్‌ రేటుకి వారు చెప్పిందే ఎక్కువ. అసలు నీకు చాన్స్‌ ఇవ్వడమే గొప్పగా భావించు అని చేసిన వ్యాఖ్యలు పట్నాయక్‌ని తీవ్రంగా బాధించాయి. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత ఆయన నటునిగా, సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కూడా మారి సందేశాత్మక చిత్రాలను తీస్తున్నాడు. ఇక ఎప్పుడు కొత్తవారిని ప్రోత్సహించే ఆర్పీ పట్నాయక్ ఈటీవీలో పాడేందుకు  ఉషకి మొదటి చాన్స్‌ ఇచ్చాడు. ఆ విధంగా ఉషకు ఆర్పీ గురువనే చెప్పాలి. కానీ ఆ తర్వాత వారి మద్య తెలియని అంతరం ఏర్పడింది. దీని గురించి ఆర్పీ మాట్లాడుతూ, ఉష ఎంతో మంచి సింగర్‌ అని..ఆమెకు చాన్స్‌ ఇచ్చాను. కానీ ఓ పార్టీకి నేను వెళ్లితే ఆమె అందరికీ హాయ్‌ చెప్పి నన్ను కనీసం హాయ్‌ అని కూడా పలకరించలేదు. మరి ఉషకు ఏమైందో నాకైతే అర్ధం కాలేదు. ఆ తర్వాత ఆమె రీసెంట్‌గా మరో పార్టీలో కలిసి పలకరించింది. ఇప్పుడు మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని క్లారిటీ ఇచ్చాడు.

RP Patnaik Clash With Director Teja And Usha:

RP Patnaik Opens Up About Clash With Director Teja And&nbsp;<span>Singer Usha</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs