Advertisement
Google Ads BL

ఎదురుగా చూస్తే చిరు దంపతులు వున్నారు!


హాస్యనటుడిగా, కామెడీ హీరోగా, టీవీసీరియల్స్‌లో కూడా నటించిన సీనియర్‌ ఆర్టిస్ట్‌ శివాజీరాజా. ఆయనకు చాలాఏళ్లకిందట ఓ దుర్ఘటన జరిగింది. దాని గురించి ఆయన మాట్లాడుతూ, నేను రామచంద్రాపురం నుంచి డ్రైవర్‌తో కలిసి కారులో ప్రయాణిస్తున్నాను. హైదరాబాద్‌కి వస్తున్న సమయంలో తెల్లవారు జామున 5గంటలప్పుడు మా డ్రైవర్‌ మా కారుని డివైడర్‌కి గుద్దేశాడు. తెల్లవారితే వినాయక చవితి. ఈ ప్రమాదంలో మా అసిస్టెంట్లకు కాళ్లు విరిగాయి. మా డ్రైవర్‌ కు కూడా దెబ్బలు బాగా తగిలాయి. నాకు ఎడమ వైపు పూర్తిగా భయంకరంగా దెబ్బతగిలింది. ఆ సమయంలో ఇండస్ట్రీలోని అందరూ కలిసి నావెంట ఉండి నన్ను బతికించారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు 13రోజులు కోమాలో ఉన్నాను. 

Advertisement
CJ Advs

చిరంజీవి దంపతులు నేను కోమాలో ఉండగా నన్ను చూడటానికి హాస్పిటల్‌కి వచ్చారట. శివాజీరాజా కోమా నుంచి కోలుకోగానే నాకు ఫోన్‌ చేయమని చిరంజీవి అక్కడి వారితో చెప్పారట. చివరకు నేను కోమాలో నుండి బయటకి వచ్చిన తర్వాత ముందుగా నా కళ్లకు చిరంజీవి దంపతులే కనిపించారు. ఇక అంత కన్నా ఏమి కావాలి? అని చెప్పుకొచ్చాడు. అయితే కొన్నిరోజుల కిందట చిరంజీవి తనకు సినిమాల విషయంలోనే కాదు ఏ విషయంలోనూ సహాయం చేయలేదని సంచనల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

ఇక శివాజీరాజాకి మంచి వాడిగా పేరుంది. కానీ ఒకానొక సమయంలో శివాజీ రాజా తల్లితండ్రులు తన కొడుకు తన భార్యమాటలు విని, తమను చూడటం లేదని, ఇంట్లో నుంచి గెంటివేశారని, వృద్ద దంపతులైన తమని కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారని మీడియా ముందుకొచ్చారు. ఆ తర్వాత ఆ వ్యవహారం సెటిల్‌ అయింది. అయినా శివాజీరాజా మీద ఆయన కన్నతల్లిదండ్రులే అరోపణలు చేయడం అప్పట్లో పలువురికి విస్మయానికి గురి చేసింది. 

Sivaji Raja Accident Story:

Sivaji Raja shared a bitter experience with Chiranjeevi and Cinema Industry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs