సహజంగా లోకం కాకులని, పలువురు పలు విధాలుగా అంటూ ఉంటారని పెద్దలు చెబుతుంటారు. ఇక సినిమా ఫీల్డ్‌లో ఇగోలు, క్రియేటివ్ డిఫరెన్స్‌లు తోపాటు చెప్పుడు మాటలను వినేవారు, అలా చెప్పేవారిని ప్రోత్సహించే వారు కూడా ఉంటారు. అది కూడా మహిళల విషయంలో ఇది పెద్ద కత్తి మీద సాము వంటిదే. అందరితో కలివిడిగా, జాలీగా ఉండేవారిని చూసి ఆమె ఓవర్‌యాక్షన్ చూశారా? అలా అతిగా ఉంటే మాకు చికాకు అంటారు. ఇక ఎందుకులే అని తమ పని తాము చేసుకుని పోయేవారిని ఈమెకు గర్వం ఎక్కువ, ఎవ్వరితో సరిగా కలవదు అంటూ ఉంటారు.
ఇక సింగర్ సునీత పాడిన పాటలే కాదు.. ఆమె మాటలు కూడా సున్నితంగా ఉంటాయి. కానీ ఆమెపై మిగిలిన వారిలో ఎన్నో స్పర్ధలు, అనుమానాలు ఉన్నాయి. గాయని ఉషతో ఆమెకు పడదని అంటారు. దానికి సునీత సమాధానం ఇస్తూ.. ఎందుకో తెలియదు గానీ ఉష నేను ఎక్కడ ఉన్నా కంఫర్టబుల్‌గా ఉండేది కాదు. దాంతో నేను మౌనంగా ఉండేదానిని. మా ఇద్దరికీ అసలు గొడవ పడిన సందర్భమే లేదు. నేను ఏదో సమయంలో ఆమెని ఏదో అన్నానని ఆమె ఫీలయిందని తెలిసింది. ఇక నేను పాల్గొన్న షోలో తనకు అవమానం జరిగిందని ఓ ఇంటర్వ్యూలో ఉదయభాను నా పేరు చెప్పకుండా చెప్పాల్సింది చెప్పేసింది. ఆమె నాతో కలిసేది కాదు. ఇబ్బందిగా ఫీలయ్యేది. అదే తను అనుకున్న అవమానాన్ని నాకే చెప్పేసి ఉంటే ఇప్పుడు దీని గురించి మాట్లాడే అవసరం లేదు కదా...!
ఇక కౌసల్య విషయంలోనూ అంతే. ఇక నాకు ఉష, ఉదయభాను, కౌసల్య.. ఇలా ఎవ్వరి మీద జెలసీ లేదు. నాకంటే ఆలస్యంగా ఫీల్డ్‌కి వచ్చి వరుసగా చాన్స్‌లు సంపాదిస్తున్నారనే ఫీలింగే నాకు ఉండేది కాదు. అలా అనుకుంటే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే దానిని. ఎందుకంటే నా తర్వాత వచ్చిన వారు కూడా నాకంటే ఎక్కువ పాటలు పాడేశారు. నేను ఇతరులను డిస్ట్రర్బ్ చేయడం ఎందుకని మౌనంగా ఉండేదానిని. కానీ చాలా మంది నన్ను అపార్ధం చేసుకున్నారని ఇటీవలే నాకు అర్ధమైంది.. అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సునీత.