Advertisement
Google Ads BL

శివాజీరాజా గొప్పతనానికి నిదర్శనం ఇది..!


శివాజీరాజా చిన్ననటుడే కావచ్చు. ఆయనకేమీ స్టార్‌హోదా లేకపోవచ్చు. కానీ ఆయనకి మంచి మనసుంది, నిజాన్ని నిజం అని ఒప్పుకునే ధైర్యం ఉంది. మా ప్రెసిడెంట్‌ అయిన తర్వాత కూడా ఆయన హీరో ఉదయ్‌కిరణ్‌, సీనియర్‌ నటుడు రంగనాథ్‌ల మరణం విషయంలో చెప్పిన వాస్తవాలు నిజంగా గ్రేట్‌. ఇక డ్రగ్స్‌ కేసులో కూడా ఆయన తన పంధా చాటారు. తప్పున్నవారికి శిక్షపడుతుంది. తప్పుచేయని వారిని ఎవరూ శిక్షించలేరు కదా...! అసలు ఉద్యోగులు పోలీసులు తమ పనిని తాము నిర్వర్తిస్తుంటే మద్యలో వారి విధుల్లో జోక్యం చేసుకోవడానికి వర్మ ఎవరు?? అంటూ ఫైర్‌ అయి, పరిశ్రమ తరపున తమ మద్దతు ప్రభుత్వానికి అధికారులకు ఉంటుందని హామీ ఇచ్చాడు. 

Advertisement
CJ Advs

ఇక రాజేంద్రప్రసాద్‌ నాకంటే గొప్పనటుడే కావచ్చు కానీ వ్యక్తిత్వంలో ఆయన నా గోటికి కూడా సరిపోడని ఎడాపెడా వాయించాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, తాను ఫిలింనగర్‌లో 'అమృతం' సీరియల్‌ చేస్తున్నప్పుడు శంకర్‌గౌడ్‌ అనే వ్యక్తి ఓ చిన్నబాబుని తీసుకుని షూటింగ్‌ స్పాట్‌కి వచ్చాడు. నా కుమారుడికి గుండె వ్యాధి ఉంది.. ఆపరేషన్‌కి 35 వేలు అవుతుందని వేడుకున్నాడు. నాటి రోజుల్లో 35వేలు అంటే నాకు కూడా చాలా పెద్ద మొత్తమే. అయినా కూడా అడ్జెస్ట్‌ చేసి ఆయనకిచ్చాను. ఆ తర్వాత ఆయన మరోసారి నా వద్దకు వచ్చి మా ఊరి జాతరకు రమ్మని పిలిచాడు. అక్కడికి వెళ్లిన నాకు నా పిల్లాడిని బతికించిన దేవుడు ఈయనే అని పరిచయం చేశాడు. నాడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. 

ఆ తర్వాత నాకు యాక్సిడెంట్‌ అయిందని, కిడ్నీ అవసరమని హాస్పిటల్‌కి వచ్చాడట. నేను స్పృహలో కూడా లేను. కానీ ఆయన హాస్పిటల్‌ వారితో 'మా సార్‌కి నేను కిడ్నీఇస్తాను' అని 13రోజుల పాటు హాస్పిటల్‌ వద్దనే వేచి ఉన్నాడు. చివరకు నేను కోమాలోంచి బయటకు వచ్చి కిడ్నీ అవసరం లేదని చెప్పిన తర్వాత గానీ ఆయన తన ఊరికి వెళ్లలేదు.. అంటూ ఉద్వేగంతో చెప్పుకొచ్చాడు. 

Sivaji Raja Greatness Revealed:

Sivaji Raja Helps A Child Heart Operation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs