Advertisement
Google Ads BL

వారి మధ్య హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలట!


అల్లుఅర్జున్- అను ఇమ్మాన్యుయేల్ మొదటిసారి జోడి కడుతున్న ‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’ సినిమా..... ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని రైటర్ వక్కంతం వంశి డైరెక్ట్ చేస్తున్నాడు. మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి వక్కంతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడనే టాక్ వుంది. ఆర్మీ ఆఫీసర్ గా కనబడనున్న అల్లు అర్జున్ ఈ సినిమా కోసం అచ్చం ఆర్మీ ఆఫీసర్ లాగే తయారయ్యాడనే విషయం ఈ మధ్యన బయటికొచ్చిన బన్నీ లుక్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ చిత్రంలో ఠాకూర్ అనూప్‌సింగ్ విలన్ గా నటిస్తున్నాడు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు తాజాగా 'నా పేరు సూర్య' కి సంబందించిన కొన్ని స్టిల్స్ షూటింగ్ స్పాట్ నుండి లీక్ అయ్యాయి.  అల్లు అర్జున్ - ఠాకూర్ అనూప్‌సింగ్ మధ్య హైవోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌ని డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్నాడు.ఆ షూటింగ్ లోని పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. వారిద్దరి మధ్యన యాక్షన్ సన్నివేశాలు అనుకున్న దానికంటే సూపర్ గా రావడంతో చిత్ర బృందం మొత్తం ఫుల్‌ఖుషీ గా ఉందట. ఈ యాక్షన్ సన్నివేశాలు 'నా పేరు సూర్య' సినిమాకే హైలెట్ అంటున్నారు.

యాక్షన్‌ కింగ్ అర్జున్, శరత్‌ కుమార్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 27న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Naa Peru Surya Naa Illu India Movie Highlights!:

Allu Arjun New Starring Movie Naa Peru Surya Naa Illu India in this movie Allu Arjun between Thakur Anoop Singh Fight Highlight.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs