Advertisement
Google Ads BL

సమంత తనపై తానే సెటైర్ వేసుకుంది!


అక్కినేని నాగచైతన్య-సమంతల పెళ్లి అక్టోబర్‌ 6,7 తేదీల్లో హిందు, క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగచైతన్య తల్లి లక్ష్మి, మేనమామలు దగ్గుబాటి సురేష్‌బాబు, వెంకటేష్‌లు చెన్నైలో ఇచ్చిన రిసెప్షన్‌, ఆ తర్వాత లండన్‌లో హనీమూన్‌, తర్వాత చై-సామ్‌లు ఫ్రెండ్స్‌కి ఇచ్చిన భారీ పార్టీ, తాజాగా నాగార్జున అరెంజ్‌ చేసిన టాప్‌ రిసెప్షన్‌ వంటివి అదిరిపోయే రేంజుల్లో జరిగాయి. ఇక తాజా రిసెప్షన్‌లో అందరినీ పేరు పేరునా పలకరిస్తూ, పెద్దల పట్ల వినయంగా గౌరవంగా, తమ తోటి వారితో జోక్స్‌ పేలుస్తూ అలసట తెలియనివ్వకుండా అన్ని వేల మందిని పేరుపేరునా పలకరిస్తూ, ఫొటోలు దిగుతూ ఈ ఇద్దరు ఎంతో అన్నోన్యంగా కనిపించారు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా తన ఈ రిసెప్షన్‌కి సంబంధించి సమంత మాట్లాడుతూ, వెడ్డింగ్‌ సీన్‌ ముగిసింది. 40రోజుల్లో 100 సెలబ్రేషన్స్‌, ఈ అందమైన దుస్తులు ధరించి ఎంతో ఎంజాయ్‌ చేశాను... అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలను పెట్టింది. ఇక ఈమె పెట్టిన ఫొటోలన్నింటిలో ఈమె ఎంతో నవ్వుతూ ఉంది. కానీ ఒక్క ఫొటోలో మాత్రం సీరియస్‌గా స్మైల్‌లెస్‌ ఫేస్‌పెట్టి ఉంది. దీనిపై ఆమె కామెంట్‌ చేస్తూ, నా ముఖంలో నవ్వు లేకుండా ప్లాస్టర్‌ వేసుకున్న ఫొటో ఇది. నేనే ఆశ్యర్యపోయాను.. అంటూ తనపై తాను సెటైర్‌ వేసుకుంది. 

ఇక నాగార్జున  తాజాగా మాట్లాడుతూ, సంతోషాలు, ఎమోషన్స్‌తో ఈ వారం గడిచిపోయిందన్నాడు. నిజమే భారీగా చేసిన రిసెప్షన్‌ కానీ వెంటనే తన తండ్రి ఏయన్నార్‌కి గుర్తుగా ఆయన తన స్టూడియోలో ఉన్న 'మనం' సెట్‌ కాలిపోవడం వంటివి కూడా జరిగిన విషయం తెలిసిందే. 

Samantha Posted Beautiful Pictures on Social Media:

Samantha Comments on Her Marriage Reception Photos
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs