Advertisement
Google Ads BL

నమిత పెళ్లి శుభలేఖ కూడా వచ్చేసింది!


తెలుగులో ఎంట్రీ ఇచ్చినా కూడా తన భారీ అందాలతో తమిళతంబీలను విపరీతంగా ఆకర్షించిన నటి నమిత. ఈ బొద్దుగుమ్మకి తమిళనాట గుళ్లు కట్టే వీరాభిమానులు కూడా ఉండటం విశేషం. ఇక ఈమె కూడా మీనా, రాశి, ప్రియమణి.. ఇలా వీరి కోవలో పెళ్లి చేసుకుని గృహిణిగా మారనుంది. అయితే ఈమె పెద్దగా ఎవ్వరికి పరిచయం లేని, చిన్న ఆర్టిస్ట్‌ అయిన వీర్‌ అనే నటుడిని వివాహం చేసుకోనుంది. వాస్తవానికి సినిమా అవకాశాలు తగ్గడం, వయసు కూడా మీద పడుతూ ఉండటంతో ఈమె ఈ నిర్ణయం తీసుకుంది. రాశి ఊరు పేరులేని ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని చేసుకున్నట్లే ఈమె కూడా తనదైన శైలిలో మొగుడిని వెతుక్కుంది. 

Advertisement
CJ Advs

ఇక నమిత పెళ్లి వార్త తమిళ తంబీలకు బాగానే నిరాశను కలిగిస్తోంది. తమ అందాల తార ఇక తెరపై కనిపించదా? అనే ఆవేదనలో వారు ఉన్నారు. ఇప్పటివరకైతే నమిత పెళ్లి తర్వాత నటిస్తుందా? లేదా? అనే విషయంలో పూర్తి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక పెళ్లి తర్వాత ఆమె అడుగులు తమిళనాడు రాజకీయాలవైపు మళ్లవచ్చని భావిస్తున్నారు. ఇక ఇటీవల 60ఏళ్లకు మించిన నటుడు శరత్‌బాబుతో నమిత వివాహం చేసుకోనుందని వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఇరువురు కొట్టిపారేశారు. ఇక తాజాగా నమిత, వీర్‌ల వెడ్దిండ్‌ ఇన్విటేషన్‌ కూడా వచ్చేసింది. 

తాము కొంత కాలంగా ప్రేమించుకుంటున్నామని, తమ పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటున్నామని ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇక నమిత, వీరేంద్ర చౌదరిల సంగీత్‌ ఫంక్షన్‌ ఈనెల 22న తిరుపతిలోని సింధూరి పార్క్‌ హోటల్ లో సాయంత్రం 7.30గంటలకు జరుగుతుంది. ఇక పెళ్లి నవంబర్‌ 24న తిరుపతిలోని ఇస్కాన్‌ మందిరంలో ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా ఉదయం 5 గంటల 30 నిమిషాలకు జరుగనుంది. 

Namitha Sangeet and Wedding Invitations:

Namitha and Veer Marriage Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs