Advertisement
Google Ads BL

రానా మళ్లీ కింగ్ అవుతున్నాడు..!


రానా దగ్గుబాటి ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న హీరో. వరుసబెట్టి సినిమాలు చేస్తూ హిట్స్ కొట్టేస్తున్నాడు. రానా నుండి సినిమా వస్తుంది అంటే ఏదో విషయం ఉందనే లెవల్లో రానా సినిమాలుంటున్నాయి. బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి హిట్స్ తర్వాత రానా ఇప్పుడు 1945  సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రానా  ఎలా వుండబోతున్నాడో  అనేది అతని లుక్ ని బట్టి తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత రానా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయాన్నీ రివీల్ చేశాడు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబందించిన వివరాలు చెబుతూనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒక పిరియాడికల్ డ్రామా అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో రానా మార్తాండ వర్మ అనే రారాజు పాత్రలో నటించనున్నాడట . ట్రావెన్కోర్ ని పాలించిన రాజుగా మార్తాండ వర్మ ప్రసిద్ధి చెందాడు. ఈ సినిమాని కె. మధు దర్శకత్వం వహించబోతున్నట్లుగా రానా చెబుతున్నాడు. ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నా చిత్ర బృందం  ఈసినిమా పట్టాలెప్పుడు ఎక్కుతుందనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.  ఇక రాబిన్ తిరుమల కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని మధు దర్శకత్వం వహిస్తుండగా... సెవెన్ ఆర్ట్స్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా రానా తెలిపాడు. మరి బాహుబలిలో భళ్లాలదేవగా ఇరగ్గొట్టేసిన  రానా ఇప్పుడు మార్తాండ వర్మగా ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

Marthanda Varma - Rana New Experiment!:

Rana To Play Anizham Thirunal Marthanda Varma - The King of Travancore
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs