'ఖాకి' మేకింగ్ వీడియో సోషల్ వీడియోలో దుమ్మురేపుతోంది. సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతోంది. ఈ చిత్రంలో కార్తి పోలీస్ అధికారిగా నటించారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలో ఉండాల్సిన అన్ని రకాల యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఉన్నట్టు మేకింగ్ వీడియో చూడగానే అర్థమవుతోంది. వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రమిది. దానికి తగ్గట్టుగానే పోలీసులు చేసే పలు రకాల ఆపరేషన్లను, ప్రాణాలకు తెగించి పోరాడే వైనాన్ని తెరకెక్కించారు. మేకింగ్ వీడియో చూసిన వారికి ఎవరికైనా కార్తి పడ్డ కష్టం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.
కథను నమ్మి, కథ డిమాండ్ చేసే ప్రతి అంశాన్నీ ఎంతకైనా తెగించి చేసే కార్తి తత్వం ఈ వీడియో ద్వారా మరోసారి తెరపై కనిపించింది. తనను ఎన్నాళ్లుగానో వెంటాడుతున్న కథనే దర్శకుడు హెచ్.వినోద్ చెప్పినప్పుడు ఒకరకమైన ఉత్కంఠకు లోనైనట్టు కార్తి ఇదివరకే చెప్పారు. కార్తి సరసన ఈ చిత్రంలో రకుల్ ఫ్రీత్సింగ్ నటిస్తున్నారు. తొలిసారి వీరిద్దరు జోడీ కడుతున్నారు. వారిద్దరి జంట చూడ ముచ్చటగా ఉంది. జిబ్రాన్ పాటలకు మంచి స్పందన వస్తోంది.