క్లాస్, మాస్ ఇలా రెండు విభిన్న వర్గాలను కూడా ఒకే రీతిలో అలరించే స్టార్ మహేష్‌బాబు. చూడటానికి మిల్క్‌బోయ్‌లా ఉండే ఈ హీరో యాక్షన్ సీన్స్, ఫైట్స్‌లో కూడా తనదైన శైలిలో అదరగొడుతాడు. క్లాస్‌గా కనిపిస్తూనే మాస్‌గా రెచ్చిపోతుంటాడు. అందుకే ఆయన నటించే చిత్రాలు యూత్, క్లాస్, మాస్, ఫ్యామిలీ వంటి తేడాలు లేకుండా అందరినీ అలరిస్తుంటాయి. నిజానికి ఫైట్ సీన్లలో కొన్నింటిలో ఆయన పరుగెత్తే విధానం చూస్తే ఒలింపిక్స్ స్ప్రింటర్లను పోలి ఉంటుంది. ఇక 'బ్రహ్మోత్సవం, స్పైడర్'లతో అభిమానులను, ప్రేక్షకులను కూడా నిరాశపరిచిన ఆయన 'శ్రీమంతుడు' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ద్వితీయ చిత్రం 'భరత్ అనే నేను' చిత్రం విషయంలో యాక్షన్‌సీన్స్, సాంగ్స్, పొటిలిటికల్ యాంగిల్, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటివన్నీ సమతూకంగా ఉండేలా చూసుకుంటున్నాడు.
దానయ్యనిర్మిస్తోన్న ఈ చిత్రంలో మంచి రాజకీయనాయకుడు అంటే ఎలా ఉండాలి? నీతవంతంగా పాలన చేయడం ఎలా? వంటి సందేశాన్ని కూడా కొరటాల శివ చూపించనున్నాడు. రాజకీయనాయకుడైన తండ్రి చనిపోతే సీఎం అయిన కుర్రాడు రాజకీయ ప్రక్షాళనకు ఏమి చేశాడు? అనేది స్టోరీ అని తెలుస్తోంది. ఇక 'శ్రీమంతుడు' చిత్రంలో మామిడితోట వద్ద యాక్షన్ సీన్‌కి ఎంత బిగ్‌రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలుసు. అదే తరహాలో 'భరత్ అనే నేను' చిత్రంలో కూడా తాజాగా ఓ హోళీ ఫైట్‌ని చిత్రీకరించారట. హోళీ రంగుల ముసుగులో తనని చంపేయడానికి వచ్చిన విలన్ గ్యాంగ్ రౌడీలను ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మహేష్ ఎలా మట్టికరిపించాడు? అన్నదే ఈ సీన్ వచ్చే సందర్భమట.
ఇక హోళీ రంగుల్లో రౌడీలకు రంగు పడేలా బాదేస్తున్న మహేష్‌ని చూసి రేపు థియేటర్లలో ప్రేక్షకులు, అభిమానులు రంగుల కాగితాలు, రంగులు చల్లుకుంటూ నానా హంగామా చేయడం ఖాయమంటున్నారు. ఈ చిత్రానికి ఈ యాక్షన్ సీన్ హైలైట్ అవుతుందిట. ఇక తాజాగా మహేష్ థమ్స్ అప్ యాడ్ కోసం హాలీవుడ్ వెళ్లాడు. 20వ తేదీలోపు తిరిగి వస్తాడని, మహేష్ వచ్చిన తర్వాత పొలాచ్చిలో ఈనెల 26 నుంచి తాజాగా షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రం వచ్చే వేసవి కానుకగా ఏప్రిల్ 27న విడుదల కానుంది.